భారత్‌కు ఇది సువర్ణావకాశం: హర్భజన్ సింగ్

ABN , First Publish Date - 2021-12-09T22:52:59+05:30 IST

రెయిన్‌బో నేషన్ సౌతాఫ్రికాలో త్వరలో ప్రారంభం కానున్న టెస్టు సిరీస్ టీమిండియాకు సువర్ణావకాశమని వెటరన్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ ..

భారత్‌కు ఇది సువర్ణావకాశం: హర్భజన్ సింగ్

న్యూఢిల్లీ: రెయిన్‌బో నేషన్ సౌతాఫ్రికాలో త్వరలో ప్రారంభం కానున్న టెస్టు సిరీస్ టీమిండియాకు సువర్ణావకాశమని వెటరన్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ పేర్కొన్నాడు. భారత జట్టు దక్షిణాఫ్రికాలో ఇప్పటి వరకు ఒక్క సిరీస్ కూడా గెలవలేదని పేర్కొన్న భజ్జీ.. ఈ పర్యటనను కోహ్లీ టీం సద్వినియోగం చేసుకోవాలన్నాడు. దక్షిణాఫ్రికాలో ఇండియాకు అంత ఘనమైన చరిత్ర ఏమీ లేదన్నాడు. దక్షిణాఫ్రికా గడ్డపై ఆ దేశంతో భారత జట్టు ఇప్పటి వరకు 20 టెస్టులు ఆడగా, మూడింటిలో మాత్రమే విజయం సాధించింది.


సఫారీ జట్టు గతంలో ఉన్నంత బలంగా లేదని పేర్కొన్న హర్భజన్.. భారత్‌కు ఇప్పుడిది సువర్ణావకాశంగా మారే అవకాశం ఉందని భావిస్తున్నట్టు చెప్పాడు. గతంలో ఆ జట్టులో ఏబీ డివిలియర్స్, ఫా డుప్లెసిస్ వంటి వారు ఉండేవారని, భారత జట్టు గెలిచేందుకు వారు అవకాశం ఇచ్చేవారు కాదని పేర్కొన్నాడు. దక్షిణాఫ్రికాలో భారత జట్టు బాగానే ఆడినప్పటికీ సిరీస్‌ను గెలుచుకోలేదన్నాడు.


హర్భజన్ సింగ్ రెండుసార్లు దక్షిణాఫ్రికాలో పర్యటించాడు. తొలిసారి 2001లో పర్యటించినప్పుడు మూడు వికెట్లు మాత్రమే పడగొట్టిన భజ్జీ, రెండోసారి 2010లో ఏకంగా 15 వికెట్లు పడగొట్టాడు.

Updated Date - 2021-12-09T22:52:59+05:30 IST