May 11 2021 @ 04:51AM

ఇటు హీరో అటు విలన్‌

పాత తరం కథానాయకులు ఒక్కసారి హీరోగా స్టార్‌డమ్‌ వచ్చాక విలన్‌ పాత్రలో నటించడానికి మొగ్గు చూపేవారు కాదు. అయితే ఈ తరం హీరోల్లో కొందరు మాత్రం పాత్రల విషయంలో గిరి గీసుకోవటం లేదు. ఓ వైపు హీరోలుగా సూపర్‌ హిట్‌ లు అందుకుంటూనే నటనకు మంచి స్కోప్‌ ఉన్న విలన్‌ పాత్రలు దొరికితే అందిపుచ్చుకుంటున్నారు. ఇటు హీరో అటు విలన్‌గా రెండు పాత్రల్లోనూ ప్రేక్షకులను మెప్పిస్తూ కెరీర్‌ను బ్యాలెన్స్‌ చేస్తూ ముందుకెళుతున్న హీరోలు వీరే.


ఆర్య - ఎనిమీ 

తమిళ హీరోలు ఆర్య, విశాల్‌ ఇద్దరూ మంచి మిత్రులు. గతంలో వీరిద్దరూ కలసి బాలా దర్శకత్వంలో ‘అవన్‌ ఇవన్‌’ చిత్రంలో సోదరులుగా కనిపించారు. తాజాగా వీరిద్దరూ శత్రువులుగా మారారు. అది ‘ఎనిమీ’ చిత్రంకోసం. ఈ మల్టీస్టారర్‌ చిత్రంలో విశాల్‌ హీరోగా, ఆర్య విలన్‌ పాత్రల్లో నటిస్తున్నారు. ఆనంద్‌ శంకర్‌ దర్శకత ్వం వహిస్తున్న ఈ చిత్రంలో ఆర్యకు జోడీగా మమతా మోహన్‌దాస్‌ నటిస్తున్నారు. 


హీరోగా, విలన్‌గా విజయ్‌ సేతుపతి 

ఇటు హీరో, అటు విలన్‌గా నటిస్తూ అభిమానులను ఆకట్టుకుంటున్నారు తమిళ నటుడు విజయ్‌ సేతుపతి. ఇటీవల వచ్చిన ‘ఉప్పెన’ చిత్రంలో విలన్‌గా ఆకట్టుకున్నారు సేతుపతి. ప్రస్తుతం ఆయన దక్షిణాదితో పాటు బాలీవుడ్‌లోనూ పలు చిత్రాల్లో నటిస్తున్నారు. ఆమిర్‌ఖాన్‌ ‘లాల్‌సింగ్‌ చద్దా’ చిత్రంలో విలన్‌  పాత్రలో నటించేందుకు అంగీకరించినా కరోనా నేపథ్యంలో షూటింగ్‌ ఆలస్యం కావటంతో డేట్లు అడ్జస్ట్‌ చేయలేక  ఆ ప్రాజెక్ట్‌ నుంచి సేతుపతి తప్పుకున్నారు. ప్రస్తుతం కమల్‌హాసన్‌ కథానాయకుడుగా లోకేష్‌ కనగరాజ్‌ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రంలో ఆయన మెయిన్‌ విలన్‌గా నటించాల్సి ఉంది. అయితే పలు సినిమాలతో బిజీగా ఉండటంతో సేతుపతి డేట్లు అడ్జెస్ట్‌ చేయలేకపోయారు రాజ్‌ అండ్‌ డీకే దర్శకద్వయం షాహిద్‌కపూర్‌ హీరోగా తెరకెక్కిస్తోన్న వెబ్‌సిరీ్‌సలో సేతుపతి నెగిటివ్‌ ఛాయలున్న పాత్ర పోషిస్తున్నార ని సమాచారం. 


కార్తికేయ - వాలిమై

హీరోగా ‘ఆర్‌ఎక్స్‌ 100’ చిత్రంతో మంచి హిట్‌ అందుకున్నారు కార్తికేయ. ఇటీవల ప్రేక్షకుల ముందుకొచ్చిన ‘చావు కబురు చల్లగా’ చిత్రంతో తనలోని నటుణ్ణి కొత్తగా ప్రజెంట్‌ చేసి ప్రేక్షకుల మెప్పు పొందారు. ఒకవైపు హీరోగా నటిస్తూనే గుర్తింపు తెచ్చే విలన్‌ పాత్రలను పోషిస్తున్నారు. నాని ‘గ్యాంగ్‌లీడర్‌’లో విలన్‌గా ఆయన ఆకట్టుకున్నారు. ప్రస్తుతం ఆయన తమిళ కథానాయకుడు అజిత్‌ చిత్రం ‘వాలిమై’లో విలన్‌ పాత్రను పోషిస్తున్నారు. మంచి యాక్షన్‌కు స్కోప్‌ ఉన్న ఈ చిత్రంలో హీరోకి దీటుగా ఉండే విలన్‌ పాత్రను ఆయన ఈ చిత్రంలో పోషిస్తున్నారు. ఇందులో తొలుత విలన్‌ పాత్ర కోసం అజయ్‌ దేవ్‌గణ్‌, అరవింద్‌ స్వామిని అనుకున్నారు. కానీ వారు ముందుగా అంగీకరించిన సినిమాల వల్ల ఈ అవకాశం కార్తికేయకు దక్కింది. 


పుష్ప విలన్‌గా పహాద్‌

మలయాళ చిత్రపరిశ్రమలో స్టార్‌డమ్‌ ఉన్న హీరో పహాద్‌ ఫాజిల్‌. కేవలం హీరో పాత్రలకే పరిమితం కాకుండా భిన్న ఛాయలున్న పాత్రలను పోషిస్తూ నటుడిగా తనను తాను సవాల్‌ చేసుకుంటారు. ఆ కోవలోనే తాజాగా ఆయన విలన్‌గా రెండు చిత్రాలు అంగీకరించారు. తెలుగులో అల్లు అర్జున్‌ కథానాయకుడుగా సుకుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న పాన్‌ ఇండియా చిత్రంలో ఆయన విలన్‌గా కనిపించనున్నారు. అలాగే కమల్‌హాసన్‌ కథానాయకుడుగా లోకేశ్‌ కనగరాజ్‌ దర ్శకత్వంలో తెరకెక్కుతున్న తమిళ చిత్రం ‘విక్రమ్‌’లో ఆయన రాజకీయ నాయకుడి పాత్రలో విలనిజం చూపనున్నారు. 


బాలయ్య విలన్‌గా శ్రీకాంత్‌ 

కెరీర్‌ ఆరంభంలో విలన్‌గా, ఆ తర్వాత కుటుంబ కథా చిత్రాల్లో హీరోగా తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యారు శ్రీకాంత్‌. బోయపాటి శ్రీను దర్శకత్వంలో బాలకృష్ణ కథానాయకుడుగా నటిస్తున్న చిత్రంలో శ్రీకాంత్‌ విలన్‌గా కనిపించనున్నారు. ఈ చిత్రం విలన్‌గా తనకు బ్రేక్‌ ఇస్తుందని ఆయన భావిస్తున్నారు. ‘అఖండ’తో పాటు ‘తెలంగాణ దేవుడు’, ‘కోతల రాయుడు’ చిత్రాల్లో ఆయన కీలకపాత్రల్లో నటిస్తున్నారు. 


ఎస్‌. జె. సూర్య విలన్‌ ముద్ర 

హీరో, విలన్‌, దర్శకుడిగా తమిళ చిత్ర పరిశ్రమలో తనదైన ముద్ర వేశారు ఎస్‌. జె. సూర్య. హీరోగా సక్సె్‌సలు అందుకుంటూనే విలన్‌ పాత్రల్లోనూ మెప్పించటం ఆయనకు మొదట్నుంచి అలవాటు. తాజాగా ఆయన శివకార్తికేయన్‌ కథానాయకుడుగా నటించిన ‘డాన్‌’లో మరోసారి తనదైన విలనీని పండించనున్నారు. అలాగే శింబు కథానాయకుడుగా నటిస్తున్న ‘మానాడు’ చిత్రంలో కూడా ఆయనే విలన్‌. 


సీనియర్‌ హీరోల విలనిజం

వరుణ్‌ తేజ్‌ కథానాయకుడుగా నటిస్తున్న ‘గని’ చిత్రంలో  కన్నడ అగ్రనటుడు ఉపేంద్ర విలన్‌ పాత్రలో కనిపించనున్నారని సమాచారం. అలాగే విశాల్‌ కథానాయకుడుగా నటించిన ‘అభిమన్యు’ హిందీలో సోనూసూద్‌ కథానాయకుడుగా రీమేక్‌ చేస్తున్నారు. ఇందులో విశాల్‌ విలన్‌ రోల్‌ చేస్తున్నారని వార్తలొచ్చాయి. ఒకప్పుడు హీరోగా మంచి పేరు గడించిన సైఫ్‌ అలీఖాన్‌ ప్రస్తుతం ప్రభాస్‌ ‘ఆదిపురుష్‌’ చిత్రంలో రావణుడి పాత్రను పోషిస్తున్నారు. అరవింద్‌స్వామి ప్రస్తుతం విలన్‌ పాత్రల్లో రాణిస్తున్నారు.