ఇదో రకం దా‘రుణం’

ABN , First Publish Date - 2021-01-09T07:34:59+05:30 IST

సైబర్‌ నేరాల్లో ఇదో రకం. వ్యక్తి ప్రమేయం లేకుండానే రుణం మంజూరై.. చెల్లింపూ పూర్తయి ఖాతా మూసివేత కూడా అయిపోయింది..

ఇదో రకం దా‘రుణం’

వ్యక్తి ప్రమేయం  లేకుండానే మంజూరు

ముత్తూట్‌ ఫైనాన్స్‌లో జారీ..

చెల్లింపుతో ఖాతా మూత

ఐడీఎ్‌ఫసీ ఫస్ట్‌బ్యాంక్‌ నుంచి

ఫ్లిప్‌కార్ట్‌కు రూ.60 వేలు

అప్రమత్తమైన న్యాయవాది

సైబర్‌ క్రైమ్‌ పోలీసులకు ఫిర్యాదు


హిమాయత్‌నగర్‌,జనవరి 8(ఆంధ్రజ్యోతి): సైబర్‌ నేరాల్లో ఇదో రకం. వ్యక్తి ప్రమేయం లేకుండానే రుణం మంజూరై.. చెల్లింపూ పూర్తయి ఖాతా మూసివేత కూడా అయిపోయింది..! మరో రుణమేమో ఒక బ్యాంకు నుంచి మంజూరై.. ఆన్‌లైన్‌ షాపింగ్‌ సంస్థకు బదిలీ అయి కొనసాగుతోంది. సైబర్‌ నేరాలపై మీడియాలో వస్తున్న కథనాలను చూస్తున్న తాడ్‌బన్‌కు చెందిన న్యాయవాది మహ్మద్‌ బర్కత్‌ అలీకి వ్యక్తిగత వివరాల భద్రతపై అనుమానం వచ్చి సిబిల్‌ వెబ్‌సైట్‌ను ఓపెన్‌ చేశాడు. తనకు తెలియకుండానే తన పేరిట పలు రుణాలకు సంబందించిన లావాదేవీలు జరిగినట్లు గుర్తించాడు. ముత్తూట్‌ ఫైనాన్స్‌ రుణం మంజూరు చేయడమే కాక.. మొత్తం చెల్లింపు జరగడంతో   ఖాతాను మూసివేసినట్లు సిబిల్‌ డేటాలో ఉంది. ఐడీఎ్‌ఫసీ ఫస్ట్‌ బ్యాంక్‌ రూ.60 వేలు రుణం ఇచ్చి.. ఆ మొత్తాన్ని అనుబంధ సంస్థగా ఉన్న ఆన్‌లైన్‌ షాపింగ్‌ సంస్థ ఫ్లిప్‌కార్ట్‌కు బదిలీ చేసినట్లు.. ఇది ఇంకా కొనసాగుతున్నట్లు చూపింది. లోన్‌ నంబరు చెప్పాలని కోరినా ముత్తూట్‌ ఫైనాన్స్‌ ఇవ్వకపోవడం, కనీసం ఖాతా లేకున్నా ఐడీఎ్‌ఫసీ ఫస్ట్‌బ్యాంక్‌ నుంచి రుణం మంజూరైనట్లు ఉండటంతో తీవ్ర ఆందోళనకు గురైన బర్కత్‌ అలీ.. ఐడీఎ్‌ఫసీ ఫస్ట్‌ బ్యాంక్‌ యాజమాన్యం, సిబిల్‌కు ఫిర్యాదు చేశాడు.


సరైన స్పందన లేకపోవడంతో పోలీసులను ఆశ్రయించినట్లు ‘ఏబీఎన్‌- ఆంధ్రజ్యోతి’కి చెప్పాడు. ిసిబిల్‌ సహా ఐడీఎ్‌ఫసీ ఫస్ట్‌ బ్యాంక్‌, ముత్తూట్‌ ఫైనాన్స్‌, ఫ్లిప్‌కార్ట్‌లపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు.  పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అలీ ఫిర్యాదు అందిన తర్వాత సిబిల్‌.. రుణం మంజూరు చేసిన సంబంధిత బ్యాంకుల తీరుపై విచారణ చేపట్టి వివరాలు సరి చేయాల్సి ఉంటుంది. కానీ, ఆ విధంగా చేయలేదు. మరోవైపు ముత్తూట్‌లోనే ఒకరు అలీ పేరిట రుణం తీసుకుని చెల్లించనట్లు తెలుస్తోంది. 

Updated Date - 2021-01-09T07:34:59+05:30 IST