ఇదో రకం హాబీ!

ABN , First Publish Date - 2021-09-04T05:30:00+05:30 IST

కొంతమందికి నాణేలు సేకరించడం హాబీగా ఉంటుంది. మరికొంతమంది స్టాంపులు సేకరించడం హాబీగా పెట్టుకుంటారు.

ఇదో రకం హాబీ!

కొంతమందికి నాణేలు సేకరించడం హాబీగా ఉంటుంది. మరికొంతమంది స్టాంపులు సేకరించడం హాబీగా పెట్టుకుంటారు. కానీ టర్కీకి చెందిన సెహబెట్టిన్‌ అనే వ్యక్తి మాత్రం పాత ఫోన్లు సేకరించడం హాబీగా పెట్టుకున్నాడు. ఆ విశేషాలు ఇవి...


సెహబెట్టిన్‌ వృత్తిరీత్యా ఫోన్లు బాగు చేస్తుంటాడు. తన దగ్గరకు వచ్చే పాత ఫోన్లను సేకరించడం, భద్రపరచడం చేశాడు. క్రమంగా ఇది ఆయన హాబీగా మారిపోయింది. అందులో రకరకాల ఫోన్లు సేకరించడం మాత్రమే హాబీగా పెట్టుకున్నాడు. ఇరవై ఏళ్లుగా అలా సేకరిస్తూనే ఉన్నాడు.


ప్రస్తుతం అతని దగ్గర వెయ్యికి పైగా రకరకాల మోడల్‌ ఫోన్లు ఉన్నాయి. ఇక సేకరించిన మొత్తం ఫోన్ల సంఖ్య రెండు వేలకు పైనే ఉంటుంది. ఆందులో చాలా ఫోన్ల తయారీని కంపెనీలు ఎప్పుడో ఆపేశాయి. ఇంకో విషయం ఏమిటంటే సెహబెట్టిన్‌ దగ్గర ఉన్న ఫోన్లన్నీ వర్కింగ్‌ కండీషన్‌లో ఉన్నవే.  అతడి దగ్గర ఉన్న కొన్ని పాత మోడల్‌ ఫోన్లలో చాలా విలువైనవి కూడా ఉన్నాయి. వాటిని అధిక ధర చెల్లించి కొంటామని వచ్చినా అమ్మనని చెప్పాడట. 

Updated Date - 2021-09-04T05:30:00+05:30 IST