Abn logo
Apr 9 2020 @ 21:47PM

అలా అడుగుతున్నారనే శ్రీముఖి సినిమాలు మానేసిందట

బుల్లితెరపై వచ్చే ‘పటాస్’ షో‌తో ఫేమస్ అయిన నటి, యాంకర్ శ్రీముఖి. అయితే సినిమాల్లో హీరోయిన్ అవ్వాలని వచ్చిన శ్రీముఖి రెండు మూడు సినిమాల్లో హీరోయిన్‌గా కూడా చేసింది. అల్లు అర్జున్ ‘జులాయి’ చిత్రంలో అతనికి చెల్లెలుగా చేసింది. అయితే ఆ తర్వాత సినిమాలకు స్వస్తి చెప్పి బుల్లితెరపై దృష్టి పెట్టింది. ఆమె అనుకున్నట్లుగానే బుల్లితెరపై ఆమె మంచి సక్సెస్ సాధించింది. ముఖ్యంగా ‘పటాస్’ కార్యక్రమం ఆమెను స్టార్‌ని చేసింది. అలాగే బిగ్ బాస్ 3లో రన్నర్‌గా నిలిచి తన క్రేజ్‌ను చాటుకుంది శ్రీముఖి. అయితే హీరోయిన్ అవ్వాలని వచ్చిన శ్రీముఖి కేవలం రెండు మూడు సినిమాలకే పరిమితం అవ్వడం వెనుక ఉన్న రహస్యం ఏమిటని కమెడియన్ అలీ, శ్రీముఖిని ప్రశ్నించారు. బుల్లితెరపై  అలీ హోస్ట్ చేస్తున్న ఓ కార్యక్రమానికి యాంకర్ రవితో కలిసి శ్రీముఖి పాల్గొంది. అలీ అడిగిన ప్రశ్నకు శ్రీముఖి ఆసక్తికరంగా సమాధానమిచ్చింది. 


‘‘జులాయి సినిమాలో చేస్తున్నప్పుడే నాన్నగారు సినిమాలు చేయవద్దని గట్టిగా చెప్పారు. ఆ సినిమానే నీకు ఫస్ట్ అండ్ లాస్ట్ చిత్రం అవ్వాలని ఆర్డర్ వేశారు. అయినా ఆ తర్వాత హీరోయిన్‌గా అవకాశాలు వచ్చిన రెండు మూడు సినిమాలు చేశాను. ఆ తర్వాత పూర్తిగా మానేశాను. ఆ తర్వాత టీవీ షోలు చేయడం మొదలుపెట్టాను. ఆ టైమ్‌లో త్రివిక్రమ్‌గారు ఓ సలహా కూడా ఇచ్చారు. నీవు ఎక్కువగా టీవీ షోలు చేస్తే సినిమా అవకాశాలు రావని చెప్పారు. ఆయన అన్నట్లుగానే జరిగింది. అయితే నేను టీవీ షోలు స్టార్ట్ చేసినప్పుడు రెండు, మూడు సినిమా కథలు నా దగ్గరకి వచ్చాయి. చిన్న సినిమాలే అయినా వాటిలో నా పాత్రకు తగిన ప్రాముఖ్యత లేకపోవడం, అలాగే ఎక్స్‌పోజింగ్, లిప్‌లాక్‌లు చేయాలని అడగడంతో.. అవి మనవళ్ల కాదనుకుని సినిమాలకు గుడ్ బై చెప్పాను. టీవీ షోలలో బిజీ అవ్వడంతో ఆ తర్వాత సినిమాల గురించి పట్టించుకునేంత టైమ్ కూడా రాలేదు..’’ అని శ్రీముఖి తెలిపింది.

Advertisement
Advertisement
Advertisement