డిపోల వారీగా ఇదీ పరిస్థితి

ABN , First Publish Date - 2020-09-26T09:38:51+05:30 IST

దిల్‌సుఖ్‌నగర్‌ డిపోలోని 108 బస్సులకు గాను మొదటి షిప్టులో 25 బస్సులు నడిచాయి. ఇందులో 14 బస్సులు 107 రూట్‌లో రాకపోకలు సాగించగా ఐదు బస్సులు చౌటుప్పల్‌కు

డిపోల వారీగా ఇదీ పరిస్థితి

చాదర్‌ఘాట్‌, సెప్టెంబర్‌ 25 (ఆంధ్రజ్యోతి) :  దిల్‌సుఖ్‌నగర్‌ డిపోలోని 108 బస్సులకు గాను మొదటి షిప్టులో 25 బస్సులు నడిచాయి. ఇందులో 14 బస్సులు 107 రూట్‌లో రాకపోకలు సాగించగా ఐదు బస్సులు చౌటుప్పల్‌కు, మరో ఆరు బస్సులు పోచంపల్లికి నడిచాయి. సాధారణంగా రూ.3వేల కలెక్షన్‌ వచ్చేదని, రూ.1500 మాత్రమే వచ్చిందని డిపో మేనేజర్‌ రవీందర్‌రెడ్డి తెలిపారు. రెండో షిప్టులో 19 బస్సులను 107 రూట్‌లోనే నడిపారు. 


హయత్‌నగర్‌: హయత్‌నగర్‌-1 డిపో నుంచి 30 బస్సులు, హయత్‌నగర్‌-2 డిపో నుంచి 33 బస్సులను, బండ్లగూడ డిపో నుంచి 26 బస్సులను ఆయా రూట్లలలో నడిపించినట్లు డిపోల మేనేజర్లు తెలిపారు. 


చంపాపేట: కంచన్‌బాగ్‌లోని మిధానీ ఆర్టీసీ బస్‌ డిపో నుంచి అల్మాస్‌గూడ, నాదర్‌గుల్‌ సచివాలయం వైపు 20 బస్సులు నడిచాయి. 


రాయదుర్గం: హెచ్‌సీయూ డిపో నుంచి మొత్తం 85 బస్సులు ఉండగా మొదటి రోజు 25 బస్సులు నడిపినట్లు డిపో మేనేజర్‌ దైవదీనం తెలిపారు. 


ఫతేనగర్: కూకట్‌పల్లి డిపోకు చెందిన 35 బస్సులు డిపో నుంచి బయటకు వచ్చాయి. మెహిదీపట్నం, జగద్గిరిగుట్ట, పటాన్‌చెరువు, సికింద్రాబాద్‌, చార్మినార్‌ రూట్లలో తిరిగాయి. బస్సుల్లో ప్రయాణికులు అంతగా లేరు.

Updated Date - 2020-09-26T09:38:51+05:30 IST