Abn logo
Sep 25 2021 @ 00:00AM

ఆర్టిస్టు మలిచిన స్పైడర్‌ ఇది!

ఈ చిత్రం చూస్తే హాలీవుడ్‌ సినిమాల్లో కనిపించే స్పైడర్‌లా ఉంది కదూ! అయితే ఇది పనికిరాని ఎలకా్ట్రనిక్స్‌ విడిభాగాలతో తయారుచేసిన స్పైడర్‌. హంగేరీకి చెందిన పీటర్‌ అనే ఆర్టిస్టు ప్రతిభ ఇది.

ఆర్ట్‌ డైరెక్టర్‌గా పనిచేసే పీటర్‌కు ఒక హాబీ ఉంది. పాత వస్తువు ఏదైనా కనిపిస్తే దాన్ని భద్రపరుస్తాడు. అందులో విఢిభాగాలు దేనికైనా పనికొస్తాయని ఆయన ఆలోచన. అలా పాత వాచ్‌లు, కెమెరాలు, మెడికల్‌ ఎక్విప్‌మెంట్లు వంటి పాడైపోయిన వస్తువుల్లో నుంచి విడిభాగాలు తీసి స్పైడర్లు తయారుచేస్తుంటాడు. 

వీడియోగేమ్స్‌ కోసం వర్చ్యువల్‌ క్రియేటర్స్‌, మాన్‌స్టర్స్‌ తయారుచేసే పీటర్‌కు ఒకరోజు తన ఊహల్లోని బొమ్మలను వాస్తవరూపంలోకి తీసుకురావాలని ఆలోచన కలిగింది. అప్పటి నుంచి స్పైడర్‌ల తయారీ మొదలుపెట్టాడు. 

ప్రతివారం బుడాపెస్ట్‌లో జరిగే మార్కెట్‌లో తనకవసరమైన పాత విడిభాగాల కోసం వెతుకుతాడు. ఏదైనా కనిపిస్తే కొనుగోలు చేసి స్పైడర్‌లు రూపొందిస్తుంటాడు. 


ప్రత్యేకం మరిన్ని...