ఈ మ్యూజియం చూసి తీరాల్సిందే!

ABN , First Publish Date - 2021-06-23T09:15:21+05:30 IST

భూమిపై అంతరించిన, అంతరించిపోయే దశలో ఉన్న, అన్ని రకాల జంతువుల నమూనాలను ఒకే చోట చూడొచ్చు.

ఈ మ్యూజియం చూసి తీరాల్సిందే!

భూమిపై అంతరించిన, అంతరించిపోయే దశలో ఉన్న, అన్ని రకాల జంతువుల నమూనాలను ఒకే చోట చూడొచ్చు. ఎక్కడ అంటారా? ఇజ్రాయిల్‌లో ఉన్న మ్యూజియంలో...! ఆ విశేషాలు ఇవి...


ఈ భూమిపై కొన్ని లక్షల జీవరాశులు ఉన్నాయి. వీటిలో చాలా రకాలు అంతరించిపోయాయి. అవి ఎలా ఉండేవో ఈతరం విద్యార్థులు పుస్తకాల్లో బొమ్మలు చూసి తెలుసుకోవాల్సిందే! అయితే  విద్యార్థులకు ఆ జీవరాశులు ఎలా ఉండేవో కళ్లకు కట్టినట్టుగా చూపించడం కోసం ఓ మ్యూజియంను ఏర్పాటు చేశారు.


ఈ మ్యూజియంలో యాభైఐదు లక్షల జీవరాశుల నమూనాలను, మొక్కలను ప్రదర్శన కోసం ఉంచారు. 


టెల్‌ ఎవివ్‌ యూనివర్సిటీ ప్రాంగణంలో స్టెయిన్‌హార్డ్‌ మ్యూజియం ఆఫ్‌ న్యాచురల్‌ హిస్టరీ పేరుతో ఈ మ్యూజియం ఏర్పాటుచేశారు. విద్యార్థుల కోసం, పరిశోధకుల కోసం ఈ మ్యూజియం నెలకొల్పారు. సాధారణ ప్రజలు కూడా సందర్శించే వీలుంది.

మధ్య ఆసియా ప్రాంతంలోని జీవవైవిధ్యం గురించి తెలుసుకోవడానికి ఈ మ్యూజియం చక్కగా ఉపయోగపడుతోంది.

Updated Date - 2021-06-23T09:15:21+05:30 IST