రూ. 800 కోట్ల సమీకరణ లక్ష్యంతో... ఐపీఓకు సిద్ధమవుతోన్న ప్రీమియం కార్‌ సేల్‌ కంపెనీ...

ABN , First Publish Date - 2022-01-17T22:45:02+05:30 IST

వివిధ కంపెనీల లగ్జరీ కార్లను విక్రయిస్తోన్న ఆటోమొబైల్ డీలర్‌షిప్ చైన్ ‘లాండ్‌మార్క్ కార్స్’... ఐపీఓకు వచ్చేందుకు సిద్ధమవుతోంది. మరికొన్ని వారాల్లో డ్రాఫ్ట్ రెడ్ హెర్రింగ్ ప్రాస్పెక్టస్(డీఆర్‌హెచ్‌పీ) దాఖలు చేయనుంది.

రూ. 800 కోట్ల సమీకరణ లక్ష్యంతో... ఐపీఓకు సిద్ధమవుతోన్న ప్రీమియం కార్‌ సేల్‌ కంపెనీ...

మరికొన్ని వారాల్లో డ్రాఫ్ట్ రెడ్ హెర్రింగ్ ప్రాస్పెక్టస్(డీఆర్‌హెచ్‌పీ) దాఖలు...

ఇష్యూ లీడ్ మేనేజర్లుగా యాక్సిస్ క్యాపిటల్, ఐసీఐసీఐ సెక్యూరిటీస్‌స్‌ల...


హైదరాబాద్ : వివిధ కంపెనీల లగ్జరీ కార్లను విక్రయిస్తోన్న  ఆటోమొబైల్ డీలర్‌షిప్ చైన్ ‘లాండ్‌మార్క్ కార్స్’... ఐపీఓకు వచ్చేందుకు సిద్ధమవుతోంది. మరికొన్ని వారాల్లో డ్రాఫ్ట్ రెడ్ హెర్రింగ్ ప్రాస్పెక్టస్(డీఆర్‌హెచ్‌పీ) దాఖలు చేయనుంది. పబ్లిక్ ఆఫర్ ద్వారా రూ. 800 కోట్లకు పైగా సమీకరించాలని కంపెనీ యోచిస్తోంది. ఈ క్రమంలో... ఇష్యూ లీడ్ మేనేజర్లుగా యాక్సిస్ క్యాపిటల్, ఐసీఐసీఐ సెక్యూరిటీస్‌స్‌లను నియమించింది.


మెర్సిడెస్ బెంజ్, ఫోక్స్‌వ్యాగన్, హోండా, ఫియట్‌, జీప్‌ ప్రీమియం వాహనాలను ఔట్‌లెట్ల ద్వారా ఈ కంపెనీ  విక్రయిస్తోంది. రెనాల్ట్‌ కార్లలో ఇది మూడో అతి పెద్ద రిటైలర్. ఆఫ్టర్‌ సేల్స్ సర్వీసులు కూడా ఇస్తోంది. ప్రి-ఓన్డ్‌ ప్యాసింజర్ వాహనాల విక్రయాలనూ నిర్వహిస్తోంది. వాహనాలకు బీమా పాలసీలు, వెహికల్ ఫైనాన్స్‌ సహా థర్డ్-పార్టీ ఫైనాన్షియల్ ప్రొడక్స్ట్‌ను విక్రయిస్తోంది. ప్యాసింజర్ వాహనాలతోపాటు వాణిజ్య వాహనాలను కూడా తన ఔటలెట్ల ద్వారా విక్రయిస్తోంది. మరిన్ని వివరాలిలా ఉన్నాయి. 


కాగా... భారత్లో ఐపీఓకు వస్తోన్న తొట్టతొలి ఆటోమోటివ్ డీలర్‌షిప్ కంపెనీ ఇదే. ఐపీఓ విజయవంతమైనపక్షంలో... మరిన్ని కార్‌ డీలర్‌షిప్‌ కంపెనీలు క్యూ కట్టే అవకాశమున్నట్లు సంబంధిత వర్గాలు భావిస్తున్నాయి. ప్రైవేట్ ఈక్విటీ కంపెనీల బ్యాకప్‌ అందుకున్న తొలి ఆటోమొబైల్ డీలర్‌షిప్ చైన్ కూడా ఇదే. ల్యాండ్‌మార్క్ కార్లలో టీపీజీ పెట్టుబడులున్నాయి. కాగా... 2015 ఆర్ధిక సంవత్సరంలో... టీపీజీ సుమారు రూ. 140 కోట్ల పెట్టుబడి పెట్టింది. ఈ డబ్బు అందుబాటులోకి వచ్చినప్పటి నుంచి ల్యాండ్‌మార్క్ వ్యాపారం రెట్టింపు కంటే ఎక్కువే పెరగడం విశేషం.


ఇక... 2015 ఆర్ధిక సంవత్సరం చివరినాటికి 41 ఔట్‌లెట్ల ద్వారా సుమారు 10 వేల వాహనాలను రిటైల్ చేసిన కంపెనీ, 2020 ఆర్ధిక సంవత్సరం ముగింపు నాటికి 20-25 వేల కార్లకు ఆ నంబర్‌ను పెంచింది. ఈ క్రమంలో... వార్షిక టర్నోవర్ రూ. 2,500-రూ. 3,000 కోట్లకు చేరింది. కంపెనీకి ప్రస్తుతం, ... ఎనిమిది రాష్ట్రాల్లో 110 కి పైగా ఔట్‌లెట్లు ఉన్నాయి. ఐపీఓ ద్వారా  వాటాలో కొంత భాగాన్ని టీపీజీ విక్రయించనుంది. ఫ్రెష్‌ సేల్‌ ద్వారా వచ్చే ఆదాయాన్ని కంపెనీ విస్తరణకు వినియోగించనున్నట్లు చెబుతున్నారు. కాగా... "ఇది రుణరహిత సంస్థ. కార్యకలాపాల కోసం అసెట్-లైట్ విధానాన్ని అనుసరిస్తోంది. వాహనాల సొంతదారులకు, యాజమాన్యానికి మధ్య లింకును కంపెనీ తెగ్గొట్టింది. కుటుంబ నిర్వహణ వ్యాపారాల తరహాలో కాకుండా, పక్కా ప్రొఫెషనల్‌ కంపెనీలా రన్‌ నిర్వహించాలని భావించడమే ఇందుకు కారణం. విద్యుత్తు వాహనాలను ముంబై, ఎన్‌సీఆర్‌లో విక్రయించడానికి గ్లోబల్ ఈవీ దిగ్గజం బీవైడీతో ఒప్పందం కుదుర్చుకుంది. దేశంలో అభివృద్ధి చెందుతున్న విద్యుత్తు  వాహనాల విభఆగంలో ప్రయోజనాన్ని ముందుగా అందుకోవాలని భావిస్తోన్న క్రమంలో... ఈ ఒప్పందం ఉపయోగపడుతుందని సంబంధిత వర్గాలు భావిస్తున్నాయి. 

Updated Date - 2022-01-17T22:45:02+05:30 IST