ఈ టెండూల్కర్‌... మోడల్‌

ABN , First Publish Date - 2021-12-09T05:39:47+05:30 IST

సచిన్‌ టెండూల్కర్‌ క్రికెట్‌ మైదానంలో దుమ్ము లేపితే, కూతురు శారా టెండూల్కర్‌ సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ సృష్టిస్తోంది.

ఈ టెండూల్కర్‌... మోడల్‌

చిన్‌ టెండూల్కర్‌ క్రికెట్‌ మైదానంలో దుమ్ము లేపితే, కూతురు శారా టెండూల్కర్‌ సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ సృష్టిస్తోంది. గ్లామర్‌ ప్రపంచంలో అడుగు పెట్టిన శారా, ప్రముఖ దుస్తుల బ్రాండ్‌ కోసం రూపొందించిన తన తొలి ప్రమోషనల్‌ వీడియోతో ఇన్‌స్టాగ్రామ్‌ అభిమానులను ఆశ్చర్యానికి గురి చేసింది. మోడల్‌గా మారబోతున్న శారా గురించిన ఆసక్తికరమైన విశేషాలు...


భారతదేశంలో అత్యంత అభిమానుల ఆదరణ పొందిన ప్రముఖుల సంతానంలో శారా టెండూల్కర్‌ ఒకరు. కూల్‌గా, క్యూట్‌గా కనిపించే శారాకు సామాజిక మాధ్యమాల్లో ఫ్యాన్‌ ఫాలోయింగ్‌కూ, ఫ్యాన్‌ పేజీలకు కొదవే లేదు. వేడుకలు, పార్టీలు, సినిమా ప్రీమియర్లకు హాజరైన సందర్భాల్లో తల్లితండ్రులతో చిరునవ్వులు చిందిస్తూ, కెమెరాలకు పోజులిస్తూ ఉంటుంది శారా. ఇన్‌స్టాగ్రామ్‌లో సైతం ఎప్పటికప్పుడు తాజా పోస్టులను షేర్‌ చేస్తూ ఉంటుందీ భామ. అలా తాజాగా శారా పెట్టిన ఓ పోస్ట్‌ నెట్‌లో సంచలనం సృష్టించింది. నటి బనితా సంధు, తానియా ష్రాఫ్‌లతో కలిసి, శారా ఓ ప్రమోషనల్‌ మోడలింగ్‌ వీడియోను ఇన్‌స్టాలో పోస్ట్‌ చేసింది. పోస్ట్‌ చేసిన క్షణాల వ్యవధిలోనే ఆ వీడియో వైరల్‌గా మారింది. ఆ వీడియో చూసిన కొందరు ఫాలోవర్లు...‘మీ తర్వాతి స్టాప్‌ బాలీవుడ్డా?’ అని శారాను అడిగేయడం విశేషం.

అజియో యాడ్‌లో... శారా  

ధీరూబాయి అంబానీ ఇంటర్నేషనల్‌ స్కూల్‌లో చదువుకున్న శారా, తర్వాత యూనివర్శిటీ కాలేజీ ఆఫ్‌ లండన్‌లో మెడిసిన్‌లో గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేసింది. అయితే ప్రారంభం నుంచీ చక్కని డ్రస్సింగ్‌ సెన్స్‌ కలిగి ఉన్న శారా సందర్భానికి తగిన డ్రస్సులతో అలరిస్తూ వచ్చింది. తాజాగా ఇన్‌స్టాలో శారా పోస్ట్‌ చేసిన మోడలింగ్‌ వీడియో అజియో ఫ్యాషన్‌ బ్రాండ్‌కు సంబంధించినది. అజియో హై ఎండ్‌ ఫ్యాషన్‌ డివిజన్‌లో భాగమైన అజియో లక్స్‌కు శారా మోడల్‌గా మారింది. 


 తన తండ్రి, మాజీ క్రికెట్‌ కెప్టెన్‌ సచిన్‌ టెండూల్కర్‌ గురించిన ఒక డాక్యుమెంటరీ చూసిన తర్వాతే, ఆయనకు ఎందుకంత హైప్‌ ఉందో శారాకు మొదటిసారి తెలిసింది. 



సచిన్‌ తొలి సంతానం శారా. శారాకు తమ్ముడు అర్జున్‌ ముంబయి టీమ్‌ క్రికెటర్‌.

 టీం ఇండియా ఓపెనర్‌ శుభమాన్‌ గిల్‌ను శారా డేట్‌ చేస్తున్నట్టు వార్తలున్నాయి. న్యూజిల్యాండ్‌తో రెండవ టెస్ట్‌లో శుభమాన్‌ బ్యాటింగ్‌ చేస్తున్నప్పుడు, వాంఖెడె స్టేడియంలో క్రీడాభిమానులు ‘సచిన్‌, సచిన్‌’ అంటూ సచిన్‌ నామజపం చేయడం విశేషం.

పుట్టిన రోజు అక్టోబరు 12, 1997

పుస్తకాలు చదవడం, సినిమాలు చూడడం, సంగీతం వినడం శారా అభిరుచులు

శారాకు ఛారిటీ మారథాన్‌లలో పాల్గొనడం ఇష్టం. అప్‌నాలే ముంబయి మారథాన్‌ (2013)లో పాల్గొన్న అత్యంత పిన్న వయస్కురాలు శారా.

Updated Date - 2021-12-09T05:39:47+05:30 IST