Sep 29 2021 @ 01:27AM

ఈసారి యాక్షన్‌ హీరోగా..

నటుడు, డ్యాన్సర్, దర్శకుడు ప్రభుదేవా పంథా మార్చి ఈ సారి యాక్షన్‌ హీరోగా అలరించబోతున్నారు. శామ్‌ రోడ్రిగ్యూస్‌ దర్శకుడిగా పరిచయమవుతున్న చిత్రంతో ఆయన పూర్తిస్థాయి యాక్షన్‌ హీరోగా మారబోతున్నారు. ఇటీవలె పూజా కార్యక్రమంతో చెన్నైలో షూటింగ్‌ ప్రారంభమైంది. యాక్షన్‌ థ్రిల్లర్‌ నేపథ్యంలో ఈ చిత్రం తెరకెక్కిస్తున్నామని దర్శకుడు తెలిపారు. జాయ్‌ ఫిల్మ్‌ బాక్స్‌ ఎంటర్టైన్‌మెంట్‌ సంస్థ నిర్మిస్తోంది. ప్రభుదేవా ‘పొన్‌ మానికేవెల్‌’, ‘ఊమై విషిగళ్‌’, ‘భగీరా’ చిత్రాల్లో నటిస్తున్నారు.