ఈ వారం కార్యక్రం

ABN , First Publish Date - 2021-01-11T07:20:33+05:30 IST

రొట్టమాకురేవు కవిత్వ అవార్డు సభ అలిశెట్టి ప్రభాకర్‌ స్మారక పురస్కారం ‘దండుగట్టిన నాగళ్ళు’...

ఈ వారం కార్యక్రం

రొట్టమాకురేవు కవిత్వ అవార్డు సభ

రొట్టమాకురేవు కవిత్వ అవార్డు సభ జనవరి 17 ఉ.10.30గం.లకు ముంతాజ్‌ కాలేజ్‌ పరిసరాలు, బి-బ్లాక్స్‌, మలక్‌పేట్‌, హైదరాబాద్‌లో జరుగుతుంది. అధ్యక్షుడు: ప్రసేన్‌; అతి థులు: కె.శివారెడ్డి, గోరటి వెంకన్న, నారాయణశర్మ; అవార్డు గ్రహీతలు: కోడూరి విజయ కుమార్‌ (‘రేగుపండ్ల చెట్టు’), మెర్సీ మార్గరెట్‌ (‘కాలం వాలిపోతున్న వైపు’), అనిల్‌ డాని (‘స్పెల్లింగ్‌ మిస్టేక్‌’), మెట్టా నాగేశ్వరరావు (‘మనిషొక పద్యం’). 

యాకూబ్‌


అలిశెట్టి ప్రభాకర్‌ స్మారక పురస్కారం

తెలంగాణ రచయితల వేదిక కరీంనగర్‌ జిల్లా శాఖ ప్రతి యేటా రాష్ట్ర స్థాయిలో ఇచ్చే అలిశెట్టి ప్రభాకర్‌ స్మారక పురస్కారం-2021 సంవత్సరానికిగాను ప్రముఖ కవి కూకట్ల తిరుపతి ఎంపికయ్యారు. ఈ పురస్కార ప్రధాన సభ అలిశెట్టి జయంతి, వర్ధంతి రోజు జనవరి 12న కరీంనగర్‌ ఫిలిం భవన్లో జరుగుతుంది.  

కందుకూరి అంజయ్య


‘దండుగట్టిన నాగళ్ళు’

ఢిల్లీలోని రైతు ఉద్యమానికి సంఘీభావంగా గంటేడ గౌరునాయుడు వెలువరిస్తున్న కవిత్వ బులిటెన్‌ ‘దండుగట్టిన నాగళ్ళు’ ఆవిష్కరణ సభ జనవరి 14న విజయనగరం జిల్లా కొమరాడ మండలం దళాయిపేట గ్రామంలో జరుగుతుంది.

చంపావతి


రంగినేని ఎల్లమ్మ సాహిత్య పురస్కారం 2020

రంగినేని ఎల్లమ్మ సాహిత్య పురస్కారానికి వెంకట్‌శిద్ధారెడ్డి కథా సంపుటి ‘సోల్‌ సర్కస్‌’ ఎంపిక అయింది. 2021 మార్చిలో ట్రస్ట్‌ ఆవరణలో జరిగే ప్రత్యేక కార్యక్రమంలో ముఖ్య అతిథుల సమక్షంలో పురస్కార గ్రహీతకు అవార్డు కింద రూ.20116 నగదు, జ్ఞాపిక, పుర స్కార పత్రం అందజేయబడతాయి.

మద్దికుంట లక్ష్మణ్‌


రైతాంగ పోరాటంపై కవితలకు, పాటలకు ఆహ్వానం

సమకాలీన రైతాంగ పోరాటానికి మద్దతుగా రాసిన కవితలను, పాటలను సంకలనంగా ప్రచురించాలని జనసాహితి నిర్ణయించింది. మీ ప్రాంతాల్లో పత్రికలలో వచ్చిన కవితలు- వాటి రచయితల పేర్లు, ఫోన్‌ నంబర్లతో సహా-వారి అనుమతి సేకరించి పంపండి. ఎన్నిక చేసిన వాటిని సంకలనంలో ప్రచురిస్తాం. అనువాద కవితలకు మూల ప్రతి పంపాలి. జనవరి 30లోగా రచనలను ఈమెయిల్‌: ఞట్చ్జ్చట్చజిజ్టీజిజీ1977ఃజఝ్చజీజూ.ఛిౌఝకుగానీ, ‘ప్రజాసాహితి’ డోర్‌.నెం.30-7-6, దుర్గా అగ్రహారం, విజయవాడ-2కు గానీ పంపండి. 

జనసాహితి


గిడుగు సాహిత్య సేవా పురస్కారాలకు ఆహ్వానం

గిడుగు రామమూర్తి పంతులు సాహితీ సేవా పురస్కారాలకు కవులు, రచయితలు, స్వచ్ఛంద సేవకుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నాం. ఏటా ప్రకటించే ఈ పురస్కా రాలకు కవులు, రచయితలు కవిత్వం, కథలు, గజల్స్‌, విమర్శ, నవలలను జనవరి 20లోగా పంపాలి. సేవారంగాలవారు బయోడేటాను జ్చుజ్చూఝుఽ్చఛీజీౌఛీఛీఠుఽ్చఃజఝ్చజీజూ.ఛిౌఝకు పంపాలి. ఫోన్‌: 83744 39053. అడ్రస్‌: హెచ్‌ఐజి2, బ్లాక్‌ నెం.12, ప్లాట్‌ నెం.3, కెపిహెచ్‌బి క్వార్టర్స్‌, వాటర్‌ వర్క్స్‌ ఆఫీస్‌ పక్కన, బాగ్‌లింగంపల్లి, మెయిన్‌రోడ్‌, హైదరాబాద్‌-500044. 

బిక్కి కృష్ణ 


Updated Date - 2021-01-11T07:20:33+05:30 IST