ఈ ఏడాది 2-3 కోట్ల ఉద్యోగాలు

ABN , First Publish Date - 2022-01-23T07:50:26+05:30 IST

పబ్లిక్‌ వైఫై హాట్‌స్పాట్స్‌ భారీ స్థాయిలో ఉపాధి అవకాశాల కల్పనకు దోహదపడనున్నట్టు టెలికాం సెక్రటరీ కె.రాజారామన్‌ పేర్కొన్నారు. టెలికాం పాలసీ ప్రకారం ఈ ఏడాది దేశవ్యాప్తంగా కోటి పబ్లిక్‌ వైఫై హాట్‌ స్పాట్‌లను...

ఈ ఏడాది 2-3 కోట్ల ఉద్యోగాలు

పబ్లిక్‌ వైఫై 

హాట్‌స్పాట్స్‌తో 

 టెలికాం సెక్రటరీ కె.రాజారామన్‌ 

న్యూఢిల్లీ: పబ్లిక్‌ వైఫై హాట్‌స్పాట్స్‌ భారీ స్థాయిలో ఉపాధి అవకాశాల కల్పనకు దోహదపడనున్నట్టు టెలికాం సెక్రటరీ కె.రాజారామన్‌ పేర్కొన్నారు. టెలికాం పాలసీ ప్రకారం ఈ ఏడాది దేశవ్యాప్తంగా కోటి పబ్లిక్‌ వైఫై హాట్‌ స్పాట్‌లను ఏర్పాటు చేయడం ద్వారా 2-3 కోట్ల ఉద్యోగావకాశాలను సృష్టించే అవకాశం ఉందని అన్నారు. బ్రాడ్‌బ్యాండ్‌ ఇండియా ఫోరమ్‌ (బీఐఎఫ్‌) కార్యక్రమంలో రాజారామన్‌ మాట్లాడారు. ప్రధానమంత్రి వైఫై యాక్సెస్‌ నెట్‌వర్క్‌ ఇంటర్‌ఫేస్‌ (పీఎం-వాణి) పథకం విస్తరణకు దోహదపడేందుకు వైఫై ఎక్వి్‌పమెంట్‌ తయారీదారులు తమ ఉత్పత్తుల ధరలను తగ్గించాలని పిలుపునిచ్చారు. ప్రతి హాట్‌స్పాట్‌ 2-3 మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి అవకాశాలను కల్పించే అవకాశం ఉందని అన్నారు. పబ్లిక్‌ వైఫై హాట్‌స్పాట్‌లు గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు ఉత్ర్పేరకాలుగా, గ్రామీణ జీవనోపాధికి సాధనంగా పని చేస్తాయని తెలిపారు. లక్షలాది మంది స్థానిక, గ్రామీణ ఆంత్రప్రెన్యూర్లకు ఉపాధి అవకాశాలను కల్పించడం ద్వారా సామాజిక,ఆర్థిక వృద్ధిని ప్రోత్సహిస్తాయన్నారు. పీఎం వాణి కోసం లక్షలాదిగా యాక్సెస్‌ పాయింట్లను ఉత్పత్తి చేయడానికి తయారీ యూనిట్ల అవసరం ఉంటుందని, ఇవి ఉపాధి కల్పనకు దోహపడతాయని చెప్పారు. 

పీఎం-వాణి పోర్టల్‌  డేటా ప్రకారం ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా 56 వేలకు పైగా వైఫై హాట్‌స్పాట్‌లను ఏర్పాటు చేశారు. లోకల్‌ కేబుల్‌ ఆపరేటర్లు, ఇంటర్నెట్‌ సర్వీస్‌ ప్రొవైడర్లు, టూరిజం ఆపరేటర్లు వాణి యాక్సెస్‌ పాయింట్ల విస్తరణకు దోహదపడాలన్నారు. 

Updated Date - 2022-01-23T07:50:26+05:30 IST