Abn logo
Oct 12 2021 @ 01:19AM

థామస్‌ కప్‌లో భారత్‌ ఘన బోణీ

అర్హస్‌ (డెన్మార్క్‌): థామస్‌ కప్‌ ఫైనల్లో భారత్‌ ఘనంగా బోణీ చేసింది. ఆదివారం జరిగిన గ్రూప్‌-సి తొలి మ్యాచ్‌లో పురుషుల బ్యాడ్మింటన్‌ జట్టు5-0తో నెదర్లాండ్స్‌ను చిత్తు చేసింది. తొలి సింగిల్స్‌లో శ్రీకాంత్‌, డబుల్స్‌లో సాత్విక్‌-చిరాగ్‌ జోడీ, రెండో సింగిల్స్‌లో సాయి ప్రణీత్‌, రెండో డబుల్స్‌లో అర్జున్‌-ధ్రువ్‌ ద్వయం, ఆఖరి సింగిల్స్‌లో సమీర్‌ వర్మ ప్రత్యర్థులను ఓడించడంతో టీమిండియా క్లీన్‌స్వీప్ చేసింది.