Abn logo
Sep 23 2021 @ 21:28PM

ఆ రెండు బ్యాంకుల చెక్కు పుస్తకాలిక పనిచేయవు...

న్యూఢిల్లీ : ఆయా బ్యాంకుల విలీనం నేపనధ్యంలో... బ్యాంకింగ్ విషయాల్లో ఎప్పటికప్పుడు మార్పులు, చేర్పులు చోటుచేసుకుంటోన్న విషయం తెలిసిందే. ఇదే క్రమంలో...  తాజాగా పంజాబ్ నేషనల్ బ్యాంక్(పీఎన్‌బీ) కేూడా... తన ఖాతాదారులకు ఓ విషయాన్ని చెప్పింది. ఓరియెంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్(ఓబీసీ), యునైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(యూబీఐ)లకు సంబంధించిన పాత చెక్ బుక్స్ ఇక పని చెయ్యవన్నది దాని సారాంశం. ఈ క్రమంలో...  ఇప్పటికీ... ఆ బ్యాంక్ చెక్ పుస్తకాలను వినియోగిస్తోన్నపక్షంలో... వాటిని వెంటనే మార్చుకోవాల్సి ఉంటుందని పీఎన్‌బీ వెల్లడించింది. ఇ ఓబీసీ, ఇ యూఎన్‌ఐ బ్యాంకులకుల చెక్కు పుస్తకాలు... 2021 అక్టోబరు ఒకటి  నుంచి పని చేయబోవు. వాటిని పంజాబ్ నేషనల్ బ్యాంక్ చెక్ బుక్కులతో అప్‌డేట్ చేసుకోవాల్సి ఉంటుందని  వెల్లడించింది.


ఐఎఫ్‌ఎస్‌ కోడ్, ఎంఐసీఆర్‌ తో కొన్న కొత్త చెక్కు పుస్తకాలు  తీసుకోవాలని పాత ఓరియెంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్, యునైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఖాతాదారులకు ఈ సందర్భంగా సమాచారమిచ్చింది. అక్టోబరు ఒకటి నుంచి తప్పనిసరిగా ఈ కొత్త చెక్ బుక్స్‌ను మాత్రమే వినియోగించాల్సి ఉంటుంది. ఈ క్రమంలో... కొత్త చెక్కు పుస్తకాల కోసం ఏటీఎం, ఇంటర్‌నెట్ బ్యాంకింగ్, పీఎన్‌బీ వన్, కాల్ సెంటర్ ద్వారా కూడా  దరఖాస్తు చేసుకోవచ్చని వెల్లడించింది.