ఆ నోటీసులు వెనక్కు... కేంద్రం నిర్ణయం ?

ABN , First Publish Date - 2021-08-06T19:23:29+05:30 IST

వొడాఫోన్-కెయిర్న్ ఎనర్జీ కేసులో ఎదురుదెబ్బల నేపధ్యంలో... రెట్రాస్పెక్టివ్ ట్యాక్స్ పాలసీ(వెనకటి తేదీ నుండి పన్ను చెల్లించాలంటూ ఇచ్చిన నోటీసులకు ఫుల్‌స్టాప్ పెట్టాలని కేంద్రం యోచిస్తోంది.

ఆ నోటీసులు వెనక్కు... కేంద్రం నిర్ణయం ?

న్యూఢిల్లీ : వొడాఫోన్-కెయిర్న్ ఎనర్జీ కేసులో ఎదురుదెబ్బల నేపధ్యంలో... రెట్రాస్పెక్టివ్ ట్యాక్స్ పాలసీ(వెనకటి తేదీ నుండి పన్ను చెల్లించాలంటూ ఇచ్చిన నోటీసులకు ఫుల్‌స్టాప్ పెట్టాలని కేంద్రం యోచిస్తోంది. ఈ క్రమంలో... పన్ను చట్టానికి సవరణలు చేయనుంది. గురువారం కేంద్ర ప్రభుత్వం... లోక్‌సభలో... ‘ట్యాక్సేషన్ లాస్(అమెండ్‌మెంట్) బిల్లు, 2021’ను ప్రవేశ పెట్టిన విషయం తెలిసిందే.


తద్వారా 2012 మే 28 కి ముందు జరిగిన ‘భారత ఆస్తుల పరోక్ష బదలీ లావాదేవీ’లకు సంబంధించి జారీ చేసిన పన్ను నోటీసులను వెనక్కు  తీసుకునేు పరిస్థితి నెలకొంది. ఈ కేసుల్లో ఏవైనా రీఫండ్ మొత్తాలు ఉన్నప్పటికీ, వాటిని వడ్డీ లేకుండా చెల్లించడానికి కూడా ప్రభుత్వం ప్రతిపాదించింది. ఈ తరహాలో వసూలు చేసిన రూ. 8,100 కోట్ల మొ్తాన్ని తిరిగి చెల్లిస్తామని ప్రభుత్వం వెల్లడించింది. 

Updated Date - 2021-08-06T19:23:29+05:30 IST