ఆ రాజకీయాలు ఇప్పుడే ఎక్కువ! - మంచు విష్ణు

ABN , First Publish Date - 2020-03-08T06:16:27+05:30 IST

‘‘పదిహేనేళ్లుగా నేను చేసిన చిత్రాలు వేరే. నిజంగా నా ఆలోచనా విధానం వేరే. ఇప్పుడు నా ఆలోచనలకు తగ్గట్టు చిత్రాలు చేయాలని బలంగా నిర్ణయించుకున్నాను. ఇప్పుడు... విష్ణు ఒరిజినల్‌ వెర్షన్‌ రావొచ్చు.

ఆ రాజకీయాలు ఇప్పుడే ఎక్కువ! - మంచు విష్ణు

‘‘పదిహేనేళ్లుగా నేను చేసిన చిత్రాలు వేరే. నిజంగా నా ఆలోచనా విధానం వేరే. ఇప్పుడు నా ఆలోచనలకు తగ్గట్టు చిత్రాలు చేయాలని బలంగా నిర్ణయించుకున్నాను. ఇప్పుడు... విష్ణు ఒరిజినల్‌ వెర్షన్‌ రావొచ్చు. ప్రారంభం నుండి నేను నాకు నచ్చినట్టు చేసుంటే... నా ఒరిజినాలిటీ నాకు ఉండేది. నేను నమ్మింది ‘మోసగాళ్ళు’లో చేస్తున్నా’’ అని మంచు విష్ణు అన్నారు. ప్రస్తుతం ఆయన ‘మోసగాళ్లు’ చిత్రంలో నటిస్తున్నారు. ఇటీవల ‘చదరంగం’ వెబ్‌ సిరీస్‌ నిర్మించారు. వీటితో పాటు కలల చిత్రం ‘భక్త కన్నప్ప’ గురించి విష్ణు మాట్లాడారు.


ఇప్పటివరకూ నేను నటించిన చిత్రాలన్నీ మంచివే. కాకపోతే... వాటిని తెరపై ఆవిష్కరించే క్రమంలో కొన్ని తప్పులు జరిగాయి. అమెరికాలో ‘ఆచారి అమెరికా యాత్ర’ చిత్రీకరణ చేస్తున్నప్పుడు ఆడదని అర్థమైంది. తప్పు ఎక్కడ జరుగుతుందో విశ్లేషించుకోవాలని... ఏడాదిన్నర విరామం తీసుకున్నా. ఈ విరామంలో ‘నాకు నచ్చినది కాదు. నాకు నప్పే డ్రస్‌ వేసుకోవాలి’ అని తెలుసుకున్నా.


కథలపై ఖర్చుపెట్టా!

ఏడాదిన్నరగా నా దగ్గరున్న కాస్త డబ్బును కథలు తయారు చేయడంపై ఖర్చుపెట్టా. అమెరికాలో ‘వియామార్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌’ సంస్థ స్థాపించి అక్కడి రచయితలతో కథలు సిద్ధం చేయిస్తున్నా.


‘లార్డ్‌ ఆఫ్‌ ది రింగ్స్‌’ శైలిలో ‘భక్త కన్నప్ప’

హాలీవుడ్‌ సినిమా ‘లార్డ్‌ ఆఫ్‌ ది రింగ్స్‌’ శైలిలో ‘భక్త కన్నప్ప’ను భారీగా తీయాలనేది నా సంకల్పం. అందుకని, నాలుగైదేళ్ల క్రితం తనికెళ్ల భరణి అంకుల్‌ కథ చెప్పినప్పుడు హాలీవుడ్‌ సాంకేతిక నిపుణులతో ప్రీ-ప్రొడక్షన్‌ వర్క్స్‌ ప్రారంభించా. నేను అనుకున్నట్టుగా సినిమాను తీయాలంటే సుమారు రూ. 100 కోట్లు కావాలి. అంత భారీగా తీయాలంటే తన వల్ల కాదని భరణిగారు అన్నారు. తెలుగులో అగ్రస్థాయి దర్శకుల దగ్గరకు వెళితే ఎక్కువ పారితోషికం అడిగారు. అందుకని, హాలీవుడ్‌ దర్శకుడితో సినిమా తీస్తా.


జూన్‌లో డ్రీమ్‌ ప్రాజెక్ట్‌ ప్రకటన!?

నిర్మాతగా మూడు చిత్రాలు చేయబోతున్నా. జూన్‌ లేదా ఆగస్టులో నా డ్రీమ్‌ ప్రాజెక్ట్‌ ప్రకటిస్తా. ఇప్పుడు నేను అనుకున్నవి అనుకున్నట్టు జరగాలంటే... ‘మోసగాళ్ళు’ విజయం సాధించాలి!


‘చదరంగం’ వెబ్‌ సిరీస్‌ కోసం పరిశోధన చేసినప్పుడు... ఆ రోజుల్లో కంటే ఇప్పుడే కుల రాజకీయాలు ఎక్కువని తెలిసింది. ‘థాంక్‌ గాడ్‌... నేను రాజకీయాల్లో లేను’ అనుకున్నా. రాజకీయాల పరంగా తప్పు, ఒప్పు... ఏదైనా నా తొలి ప్రాధాన్యం కుటుంబానికి. నా భార్య వెరోనికా ఫ్యామిలీకి. తన తర్వాతే ఎవరైనా!


నా శ్రీమతి వెరోనికా చాలా తెలివైనది. స్మార్ట్‌ మమ్మీ! మాకు నలుగురు పిల్లలు. వాళ్ల పెంపకం విషయంలో తనని అనుసరిస్తా. రాత్రి ఏడు గంటల తర్వాత బయటకు వెళ్లను. రాత్రి భోజనం అందరం కలిసే చేస్తాం.

Updated Date - 2020-03-08T06:16:27+05:30 IST