ఆ ఏడు కంపెనీల మార్కెట్ క్యాప్... రూ. 75 వేల కోట్లు జంప్...

ABN , First Publish Date - 2021-01-04T04:15:27+05:30 IST

టాప్ 10 కంపెనీల్లోని ఏడు కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ గతవారం ఎగసిపడింది. ఈ కంపెనీల ఎం-క్యాప్ గతవారం రూ. 75,845.46 కోట్ల మేరకు పెరిగింది. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు, హెచ్‌డీఎఫ్‌సీల మార్కెట్ క్యాప్ భారీగా ఎగిసాయి.

ఆ ఏడు కంపెనీల మార్కెట్ క్యాప్... రూ. 75 వేల కోట్లు జంప్...

ముంబై : టాప్ 10 కంపెనీల్లోని ఏడు కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ గతవారం ఎగసిపడింది. ఈ కంపెనీల ఎం-క్యాప్ గతవారం రూ. 75,845.46 కోట్ల మేరకు పెరిగింది. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు, హెచ్‌డీఎఫ్‌సీల మార్కెట్ క్యాప్ భారీగా ఎగిసాయి. లాభపడ్డ కంపెనీల్లో  టెక్ దిగ్గజాలు ఇన్ఫోసిస్, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్, కొటక్ మహీంద్రా, ఐసీఐసీఐ బ్యాంకు, బజాజ్ ఫిన్‌సర్వ్ కంపెనీలున్నాయి. కాగా... రిలయన్స్ ఇండస్ట్రీస్, హిందూస్తాన్ యూనీ లీవర్ లిమిటెడ్, భారతీ ఎయిర్ టెల్ సంస్థల ఎం-క్యాప్ క్షీణించింది.మరిన్ని వివరాలిలా ఉన్నాయి. 


హెచ్‌డీఎఫ్‌సీ మార్కెట్ క్యాప్ రూ. 20,857.99 కోట్లు పెరిగి రూ. 4,62,586.41 కోట్లకు చేరుకుంది.


హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు మార్కెట్ క్యాపిటలైజషన్ రూ. 15,393.9 కోట్లు క్షీణించి రూ. 7,84,758.50 కోట్లకు చేరింది.


ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ. 10,251.38 కోట్లు పెరిగి రూ. 5,36,878.45 కోట్లకు చేరుకుంది.


ఐసీఐసీఐ బ్యాంకు మార్కెట్ క్యాప్ రూ. 9,609.3 కోట్లు ఎగసి రూ. 3,64,199.40 కోట్లకు చేరుకుంది.


టీసీఎస్ ఎం-క్యాప్ రూ. 7,410.96 కోట్లు పెరిగి రూ. 10,98,773.29 కోట్లకు చేరుకుంది.


కొటక్ మహీంద్రా బ్యాంకు ఎం-క్యాప్ రూ. 6,500.94 కోట్లు ఎగసి రూ. 3,94,914.98 కోట్లకు చేరుకుంది.


బజాజ్ ఫైనాన్స్ ఎం-క్యాప్ రూ. 5,820.99 కోట్లు పెరిగి రూ. 3,18,181.18 కోట్లుగా నమోదైంది.


ఈ సంస్థల ఎం-క్యాప్ డౌన్...

రిలయన్స్ ఇండస్ట్రీస్ ఎంక్యాప్ రూ. 4,279.13 కోట్లు తగ్గి రూ. 12,59,741.96 కోట్లకు పరిమితమైంది.


హెచ్‌యూఎల్ మార్కెట్ క్యాప్ రూ. 2,948.69 కోట్లు తగ్గి రూ.5,60,933.06 కోట్లుగా నమోదైంది.


భారతీ ఎయిర్‌టెల్ మార్కెట్ క్యాప్ రూ. 1,063.83 కోట్లు పెరిగి రూ. 2,81,015.76 కోట్లకు చేరుకుంది.


టాప్ 10 కంపెనీలు ఇవే..

టాప్ 10 కంపెనీల మార్కెట్ వ్యాల్యూయేషన్ భారీగా ఎగిసింది. టాప్ టెన్ జాబితాలో వరుసగా ఆర్‌ఐఎల్, టీసీఎస్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు, హెచ్‌యూఎల్, ఇన్ఫోసిస్, హెచ్‌డీఎఫ్‌సీ, కొటక్ మహీంద్ర బ్యాంకు, ఐసీఐసీఐ బ్యాంకు, బజాజ్ ఫైనాన్స్, భారతీ ఎయిర్‌టెల్ సంస్థలున్నాయి. 

Updated Date - 2021-01-04T04:15:27+05:30 IST