Advertisement
Advertisement
Abn logo
Advertisement

అర్హులైన వారి పేర్లను నమోదు చేయాలి

ఓటరు జాబితా పరిశీలకుడు సుదర్శన్‌రెడ్డి

ఆదిలాబాద్‌ టౌన్‌, నవంబరు 27: ఓటరు నమోదుపై మరిన్ని కార్యక్రమాలు నిర్వహించి అర్హులైన వారి పేర్లను వందశాతం నమోదు చేయాలని ఓటరు జాబితా పరిశీలకుడు, రాష్ట్ర మున్సిపల్‌ పరిపాలన, అభివృద్ధి కార్యదర్శి సుదర్శన్‌రెడ్డి అన్నారు. శనివారంకలెక్టర్‌ సమావేశ మందిరం లో కలెక్టర్‌తో కలిసి ఈఆర్‌వో, ఏఈఆర్‌వోలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లాలో 18ఏళ్లు నిండిన వయస్సు గల వారందరి పేర్లను ఓటరు జాబితాలో నమోదు చేసే విధంగా విస్త్రృత కార్యక్రమాలు నిర్వహించాలన్నా రు. ఆన్‌లైన్‌ ఎన్రోల్‌మెంట్‌ విధానంతో ఓటరు నమోదును వారి ఇంటి ముందే నిర్వహించే విధంగా ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు. జిల్లాలో 40శాతం ఎన్‌రోల్‌మెంట్‌ జరిగిందని, ఎన్నికల కమిషన్‌ నియామవళి ప్రకారం  90 శాతం ఎన్‌రోల్‌మెంట్‌ జరగాలని సూచించారు. కరోనా కారణంగా గత 2ఏళ్ల నుంచి అవగాహన, నమోదు కార్యక్రమాలు నిర్వహించలేక పోయామని తెలిపారు. వచ్చే కాలంలో 90శాతం నమోదు చేసేందుకు కార్యాచరణతో ముందుకు వెళ్తామని కలెక్టర్‌ సిక్తాపట్నాయక్‌ తెలిపారు. తహసీల్దార్లు క్షేత్రస్థాయిలో ఓటరు నమోదు ఫారాలను పరిశీలించాలని సూచించారు. 3428 ఫారం 6, 1799 ఫారం 7, 258 ఫారం 8, 166 ఫారం 8ఏలు రావడం జరిగిందన్నారు. వాటిని పరిశీలించి అధికారులు చర్యలు తీసుకుంటున్నారని తెలిపారు. ఆరోగ్యవంతమైన ఓటరు జాబితాను తయారు చేసేందుకు సంబంధిత అధికారులు చర్యలు చేపడుతున్నట్లు వివరించారు. సమావేశంలో అదనపు కలెక్టర్లు నటరాజ్‌, రిజ్వాన్‌భాషా షేక్‌, ఐటీడీఏ పీవో అంకిత్‌, ఆర్డీవో రాజేశ్వర్‌, తహసీల్దార్లు, తదితరులు పాల్గొన్నారు.  

Advertisement
Advertisement