ప్రజలకు కీలక సూచనలు చేసిన దుబాయి పోలీసులు!

ABN , First Publish Date - 2020-04-05T21:06:38+05:30 IST

ప్రాణాంతక కరోనా వైరస్‌ను కట్టడి చేయడం కోసం ప్రపంచ దేశాలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. అయినా ప్రపంచ దేశాలపై మహమ్మారి.. స్వైర విహారం చేస్తూనే ఉంది. కరోనా

ప్రజలకు కీలక సూచనలు చేసిన దుబాయి పోలీసులు!

దుబాయి: ప్రాణాంతక కరోనా వైరస్‌ను కట్టడి చేయడం కోసం ప్రపంచ దేశాలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. అయినా ప్రపంచ దేశాలపై మహమ్మారి.. స్వైర విహారం చేస్తూనే ఉంది. కరోనా కాటుకు ప్రపంచ వ్యాప్తంగా 65వేల మంది మరణించారు. ఈ నేపథ్యంలో కొవిడ్-19 వ్యాప్తిని నివారించేందుకు దుబాయ్ మరోముందడుగు వేసింది. రెండు వారాలపాటు 24 గంటల స్టెరిలైజేషన్ ప్రోగ్రామ్‌ను శనివారంరోజు ప్రారంభించింది. దీంతో ప్రజలకు దుబాయి పోలీసులు కీలక సూచనలు చేశారు. అత్యవసరం అయితే తప్ప ప్రజలు రోడ్లమీదకు రావొద్దని సూచించారు. మెడిసిన్స్‌, నిత్యావసర సరుకుల కోసం కుటుంబంలో కేవలం ఒక్కరు మాత్రమే బయటికి రావాలని తెలిపారు. మందుల, నిత్యావసర సరుకులకు సంబంధించిన చీటీని తప్పని సరిగా వెంట తెచ్చుకోవాలని చెప్పారు. ఒకవేళ పెట్రోలింగ్ పోలీసులు ఆపితే.. సంబంధిత చీటీని చూపిస్తే వదిలేస్తారని వివరించారు. అంతేకాకుండా ఇంటి నుంచి బయటికొచ్చే సమయంలో మాస్కులు, గ్లౌజ్‌లు ధరించాలని ప్రజలకు సూచించారు. ఎమర్జెన్సీ సమయాల్లో 999 నెంబర్‌కు ఫోన్ చేయాలని ప్రజలను కోరారు. 


Updated Date - 2020-04-05T21:06:38+05:30 IST