Advertisement
Advertisement
Abn logo
Advertisement

నష్టపోయిన వారికి పరిహారం ఇవ్వాలి

మండల సమావేశంలో సభ్యులు

వేంపల్లె, నవంబరు 30: భారీ వర్షాలతో నష్టపోయిన రైతులకు పరి హారం ఇవ్వాలని ఎంపీటీసీ, సర్పంచు, ప్రజాప్రతినిధులు అధికారుల కు విజ్ఞప్తి చేశారు. ఎంపీపీ నల్లంగారి గాయత్రి అధ్యక్షతన మంగళ వారం నిర్వహించిన వేంపల్లె మండల సమావేశంలో విద్య, వైద్యం, పౌరసరఫరాలు, ఉపాధి, గ్రామీణ రోడ్లు, తాగునీటి సరఫరా, పారిశు ధ్యం తదితర సమస్యలపై అధికారులతో చర్చించారు.

భారీ వర్షాలకు మండల వ్యాప్తంగా అన్ని రకాల పంటలు, పండ్లతోటలు నష్టపోయా రని సభ్యులు వివరించారు. కౌలుతో తమలపాకు సాగుచేసే రైతులకు తీరని నష్టం జరిగిందని ఆదుకోవాలని ఎంపీటీసీ సభ్యుడు చంద్రశేఖ ర్‌ తదితరులు విన్నవించారు. ఇప్పటికే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లామ ని, రైతులకు న్యాయం చేసేందుకు చర్యలు తీసుకుంటామని జడ్పీటీసీ రవికుమార్‌రెడ్డి, ఏఓ రాజేంద్ర తెలిపారు. పట్టణంలోని పలు ప్రాంతా లకు పాపాఘ్ని నుంచి తాగునీరు అందడం లేదని, కొన్ని గ్రామాల్లో భారీ వర్షాల వల్ల నీటి సమస్య తలెత్తిందని తెలియజేయగా వెంటనే చర్యలు చేపట్టాలని ఆర్‌డబ్ల్యూఎస్‌ ఏఈ, పంచాయతీ ఈఓలకు సూచించారు. పులివెందుల మార్కెట్‌ యార్డు చైర్మన్‌ చిన్నప్ప, ఉపా ధ్యక్షురాలు రమణమ్మ, ఇన్‌చార్జి ఎంపీడీఓ చంద్రశేఖర్‌రెడ్డి, మండల స్థాయి అధికారులు, ఎంపీటీసీలు, సర్పంచులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement