Advertisement
Advertisement
Abn logo
Advertisement

సరదాగా డైవింగ్‌కు వెళ్లిన బావ, బామ్మర్ది.. సముద్రతీరంలో ఏడు మీటర్ల లోతులోంచి మెరుపులు.. ఏంటా అని తీసి చూస్తే..

బావ, బామ్మర్దులైన లూయిస్​ లెన్స్, సీజర్​ గిమేనో.. స్పెయిన్​లోని జిబియా పట్టణానికి సమీపంలో ఉన్న సముద్ర తీరంలో డైవింగ్​కు వెళ్లారు. సముద్రపు అడుగున ఉన్న నాచు, పిచ్చిమొక్కలను క్లీన్‌‌ చేసే ప్రయత్నం చేశారు. అయితే ఈ క్రమంలో వారు షాక్‌కు గురయ్యారు. ఏడు మీటర్ల లోతులో క్లీన్​ చేస్తుండగా మెరుస్తున్న కొన్ని వస్తువులు వారి కంటపడ్డాయి. ఏవో కాయిన్స్ అని ముందు అనుకున్నారు. వాటిని బోటులోకి తీసుకొచ్చి పరిశీలిస్తే.. ఏవో బొమ్మలు కనబడ్డాయి. దీంతో దాదాపు రెండు గంటల పాటు కష్టపడి మిగతా వాటిని కూడా వెలికితీశారు. మొత్తం 53 బంగారు నాణేలను సేకరించారు. 


వాటిని యూరప్‌‌ అలికాంటె యూనివర్సిటీలోని ఆర్కియాలజీ డిపార్ట్‌‌మెంట్‌‌ వారికి అప్పగించారు. పరిశోధనలో అవి 4, 5 శతాబ్దాలకు సంబంధించినవని తేలింది. అన్నాళ్లయినా ఇప్పటికీ అవి చెక్కుచెదరలేదు. ఈ నాణాలపై ఉన్న బొమ్మలు రోమన్‌‌ చక్రవర్తులు వాలెంటీనియన్​ I, వాలెంటీనియన్​ II, థియోడోసియస్ I, ఆర్కాడియో, హానోరియస్‌విగా గుర్తించారు. క్రీస్తుశకం 409లో ఐబేరియన్‌‌ ద్వీపకల్పాన్ని రోమన్లు నాశనం చేశారు. అప్పుడు ఈ నాణేలు సముద్రంలో పడి ఉండొచ్చని ఆర్కియాలజిస్టులు అంటున్నారు. ప్రస్తుతం వీటిని శుభ్రం చేసి మ్యూజియంలో పెట్టడానికి రెడీ అవుతున్నారు.

ఇవి కూడా చదవండిImage Caption

Advertisement

ప్రత్యేకంమరిన్ని...

Advertisement