ఆ పురుగులు.. ‘లిఫ్టు’ తీసుకుంటాయట!

ABN , First Publish Date - 2021-01-17T08:14:34+05:30 IST

సాధారణంగా మనం అత్తి చెట్ల మొదళ్లలో చిన్న చిన్న ఆకు పురుగులను చూస్తుంటాం. వాటి కదలికలు కూడా చాలా నెమ్మదిగా ఉంటాయి. అవి తమకున్న

ఆ పురుగులు.. ‘లిఫ్టు’ తీసుకుంటాయట!

 కందిరీగలే వాటికి వాహకాలు 

సీఈఎస్‌ శాస్త్రవేత్తల అధ్యయనం 


బెంగళూరు, జనవరి 16: సాధారణంగా మనం అత్తి చెట్ల మొదళ్లలో చిన్న చిన్న ఆకు పురుగులను చూస్తుంటాం. వాటి కదలికలు కూడా చాలా నెమ్మదిగా ఉంటాయి. అవి తమకున్న చిన్న చిన్న కాళ్లతో ఒక అత్తి చెట్టుపై నుంచి మరో చెట్టుపైకి ఎలా వెళతాయి? ఇం దుకు గాను అవి వేటి దగ్గరైనా ‘లిఫ్టు’ తీసుకుంటాయా? తీసుకుంటే ఎలా అడుగుతాయి? అస లు అవి తమ వాహకాలను ఎలా ఎంచుకుంటాయి? తమ సహచర పురుగులకు ఎలాంటి సూచనలు చేస్తాయి? ఈ దిశగా ఎప్పుడైనా ఆలోచించామా? అంటే.. లేదనే చెప్పొచ్చు. కానీ, మన శాస్త్రవేత్తలు ఆలోచించారు. అధ్యయనం చేశారు. సమాధానం కనిపెట్టారు.


ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్సెస్‌ (ఐఐఎ్‌ససీ)లోని సెంటర్‌ ఫర్‌ ఎకలాజికల్‌ సైన్సెస్‌ (సీఈఎ్‌స)కు చెందిన శాస్త్రవేత్తలు జరిపిన ఈ అధ్యయనం జర్నల్‌ ఆఫ్‌ ఎనిమల్‌ అంకాలజీలో ప్రచురితమైంది.దీని ప్రకారం.. అత్తి చెట్టు మొదళ్లలో ఉండే ఆకు పురుగులు.. అక్కడే ఎక్కువగా తిరి గే కందిరీగలను తమ వాహకాలుగా మార్చుకుంటాయి. ఒక చెట్టుపై నుంచి మరో చెట్టుపైకి చేరే క్రమంలో ఇవి.. కందిరీగల పొట్ట భాగానికి అతుక్కుంటాయి.


అలా ఇవి తమ గమ్యస్థానం చేరగానే.. తమ వాహకం నుంచి విడివడతా యి. ఈ క్రమంలో.. ఇవి కందిరీగకు ఏ మాత్రం హాని కలిగించవు. చాలా ఒద్దికగా అతుక్కుంటా యి. మనం ఎలాగైతే ఖాళీగా ఉన్న బస్సు ఎక్కడానికి ఆసక్తి చూపిస్తామో.. ఇవి కూడా ఖాళీగా ఉన్న కందిరీగ పొట్టనే ఎంచుకుంటాయి. ఒక కందిరీగ.. ఒకటికి మించిన పురుగుల్ని ఏకకాలంలో తీసుకెళ్లి.. జాగ్రత్తగా వాటి గమ్యస్థానాన్ని చేరుస్తుందని పరిశోధకులు తెలిపారు. 


Updated Date - 2021-01-17T08:14:34+05:30 IST