ఇది దద్దమ్మ ప్రభుత్వం

ABN , First Publish Date - 2021-07-29T05:12:13+05:30 IST

వైసీపీ ప్రభుత్వం చేతకాని దద్దమ్మ ప్రభుత్వమని.. పరిపాలనపై కనీసం అవగాహన లేని తుగ్లక్‌ సీఎం జగన్‌కు రైతులు, ప్రజలు బుద్ధిచెప్పే రోజులు దగ్గర పడ్డాయని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు కిమిడి కళావెంకటరావు అన్నారు. తోటపల్లి నీరు పూర్తిస్థాయిలో ఇవ్వాలని కోరుతూ బుధవారం రణస్థలం తహసీల్దార్‌ కార్యాలయం ఎదుట రైతులతో కలిసి ధర్నా చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సకాలంలో తోటపల్లి నీరందక లావేరు, రణస్థలం రైతులు గత రెండేళ్లుగా నష్టపోతున్నారన్నారు.

ఇది దద్దమ్మ ప్రభుత్వం
తహసీల్దార్‌ కార్యాలయం వద్ద ధర్నా చేస్తున్న కళా వెంకటరావు, టీడీపీ నేతలు

- తోటపల్లి నీరందక రైతులు నష్టపోయారు

- టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు కళావెంకటరావు 

రణస్థలం, జూలై 28: వైసీపీ ప్రభుత్వం చేతకాని దద్దమ్మ ప్రభుత్వమని.. పరిపాలనపై కనీసం అవగాహన లేని తుగ్లక్‌ సీఎం జగన్‌కు రైతులు, ప్రజలు బుద్ధిచెప్పే రోజులు దగ్గర పడ్డాయని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు కిమిడి కళావెంకటరావు అన్నారు. తోటపల్లి నీరు పూర్తిస్థాయిలో ఇవ్వాలని కోరుతూ బుధవారం రణస్థలం తహసీల్దార్‌ కార్యాలయం ఎదుట రైతులతో కలిసి ధర్నా చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సకాలంలో తోటపల్లి నీరందక లావేరు, రణస్థలం రైతులు గత రెండేళ్లుగా నష్టపోతున్నారన్నారు. వారికి రూ.300కోట్ల  నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్‌ చేశారు. ఒకపక్క పంటలకు గిట్టుబాటు ధరలు లేక, మరోపక్క విక్రయిం చిన ధాన్యానికి బిల్లులు అందక  రైతులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. ముఖ్యమంత్రికి రైతుల ఉసురు తగులుతుందన్నారు.  ముందుగా తోటపల్లి నీరు విడుదల చేసి రైతులను ఆదుకోవాలని నినాదాలు చేస్తూ జాతీయరహదారిపై ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కిమిడి రామ్‌మల్లిక్‌నాయుడు, మండల అధ్యక్షుడు గొర్లె విజయ్‌కుమార్‌,  జడ్పీటీసీ మాజీ సభ్యుడు గొర్లె లక్ష్మణరావు, నాయ కులు వెంకటరమణారెడ్డి, ముప్పిడి సురేష్‌, పిషిని జగన్నాథంనాయుడు పాల్గొన్నారు. 

Updated Date - 2021-07-29T05:12:13+05:30 IST