నిషేధమున్నా... 400 కోట్ల డాలర్ల ఆదాయం... టిక్‌టాక్ సూపర్...

ABN , First Publish Date - 2021-01-11T21:14:13+05:30 IST

ప్రపంచవ్యాప్తంగా అత్యధిక ఆదాయాన్ని సొంతం చేసుకున్న రెండు యాప్ లో ‘టిక్‌టాక్’ ఒకటిగా నిలిచింది. ఈ యాప్‌పై భారత్ లో నిషేధమున్న విషయం తెలిసిందే. మరోవైపు ఇదే తరహా చర్యలపై అమెరికాలో న్యాయపోరాటం చేస్తోంది.

నిషేధమున్నా... 400 కోట్ల డాలర్ల ఆదాయం... టిక్‌టాక్ సూపర్...

న్యూఢిల్లీ :  ప్రపంచవ్యాప్తంగా అత్యధిక ఆదాయాన్ని సొంతం చేసుకున్న రెండు యాప్ లో ‘టిక్‌టాక్’ ఒకటిగా నిలిచింది. ఈ యాప్‌పై భారత్ లో నిషేధమున్న విషయం తెలిసిందే.  మరోవైపు ఇదే తరహా చర్యలపై అమెరికాలో న్యాయపోరాటం చేస్తోంది.


కాగా నిషేధాన్ని ఎదుర్కొంటోన్నప్పటికీ... టిక్‌టాక్ 540 మిలియన్ డాలర్ల ఆదాయాన్ని ఆర్జించి, అత్యధిక వసూళ్లను సొంతం చేసుకున్న యాప్ గా రికార్డ్ సృష్టించడం విశేషం. ఇక.. రెండో స్థానంలో డేటింగ్ యాప్ ‘టిండర్’ నిలిచింది. 


యాప్ అనలిటిక్స్ సంస్థ యాప్ టోపియా ప్రకారం... యూ ట్యూబ్ యాప్ మూడో స్థానంలో నిలిచింది.  తర్వాతి స్థానాల్లో డిస్నీ ప్లస్, ట్రాన్సెట్ వీడియోలున్నాయి. పదో స్థానంలో నెట్ ఫ్లిక్స్ యాప్ నిలిచింది. ఆదాయం విషయానికొస్తే... టిక్‌టాక్ 540 మిలియన్ డాలర్లు ఆర్జించగా, టిండర్ 513 మిలియన్ డాలర్ల ఆదాయాన్ని సాధించింది. యూ ట్యూబ్ 478 మిలియన్ డాలర్లు, డిస్నీ ప్లస్ 314 మిలియన్ డాలర్లు, టాన్సెంట్ వీడియో 300 మిలియన్ డాలర్ల ఆదాయాన్ని పొందాయి.


Updated Date - 2021-01-11T21:14:13+05:30 IST