కరోనా కేర్‌ సెంటర్లలో 1000 మందికి చికిత్స

ABN , First Publish Date - 2021-05-12T05:38:28+05:30 IST

జిల్లాలోని 9 కరోనా కేర్‌ సెంటర్లలో ఉన్న 1000 మందికి మెరుగైన చికిత్స అందిస్తున్నామని కలెక్టర్‌ కేవీఎన్‌ చక్రధర్‌బాబు తెలిపారు.

కరోనా కేర్‌ సెంటర్లలో 1000 మందికి చికిత్స
కర్ఫ్యూ అమలు పై సమాలోచనలు చేస్తున్న కలెక్టర్‌, ఎస్పీలు

ప్రతి రోజూ 7,500 మందికి పరీక్షలు 

పాజిటివ్‌ బాధితులకు హోం ఐసోలేషన్‌ ఉత్తమం

 ఎస్సీతో కలిసి కర్ఫ్యూ పరిశీలించిన కలెక్టర్‌ చక్రధర్‌బాబు 

నెల్లూరు (సిటీ), మే 11 : జిల్లాలోని 9 కరోనా కేర్‌ సెంటర్లలో ఉన్న 1000 మందికి మెరుగైన చికిత్స అందిస్తున్నామని కలెక్టర్‌ కేవీఎన్‌ చక్రధర్‌బాబు తెలిపారు. మంగళవారం ఎస్పీ భాస్కర్‌భూషణ్‌తో కలిసి నగరంలో కర్ఫ్యూ ఆంక్షలను పరిశీలించిన  అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రతి రోజూ జిల్లాలో సుమారు 7,500 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేయిస్తున్నామని, వాటి ఫలితాలను 24 గంటల వ్యవధిలోనే అందిస్తున్నట్లు చెప్పారు. పాజిటీవ్‌ వచ్చిన బాధితులు ఇంట్లోనే ఉండి  వైద్యులు సూచించిన మందులు వాడటం ఉత్తమమని చెప్పారు. కరోనా తీవ్రత ఎక్కువైనప్పుడు ఆసుపత్రులకు ఆక్సిజన్‌ కోసం వస్తున్నారని తెలిపారు. కరోనా లక్షణాలు, అనుమానం ఉన్న వెంటనే పరీక్షలు చేయించుకోవాలని పిలుపునిచ్చారు. జిల్లాలో అందుబాటులో ఉన్న ఇతర ఆక్సిజన్‌ ప్లాంట్లను కూడా పునరుద్ధరిస్తున్నామని  వాటి ద్వారా మరో 400 సిలిండర్ల ప్రాణవాయువు తోడవుతుందని అన్నారు. అనంతరం రోడ్లపైకి వచ్చిన వాహనదారులను ఏఏ అవసరాలపై వచ్చారని ప్రశ్నించారు.

Updated Date - 2021-05-12T05:38:28+05:30 IST