రెడ్‌మీట్‌తో గుండెకు ముప్పు!

ABN , First Publish Date - 2021-04-18T05:30:00+05:30 IST

రెడ్‌ మీట్‌ ఎక్కువగా తీసుకోవడం వల్ల గుండె సంబంధ జబ్బులు వచ్చే అవకాశం పెరుగుతుందని ఓ అధ్యయనంలో

రెడ్‌మీట్‌తో గుండెకు ముప్పు!

రెడ్‌ మీట్‌ ఎక్కువగా తీసుకోవడం వల్ల గుండె సంబంధ జబ్బులు వచ్చే అవకాశం పెరుగుతుందని ఓ అధ్యయనంలో వెల్లడయింది. అధ్యయనంలో భాగంగా సుమారు 20 వేల మందిని పరిశీలించారు.   ‘‘అధిక మొత్తంలో రెడ్‌ మీట్‌ తీసుకోవడం వల్ల గుండె పనితీరు దెబ్బతింటుంది. గుండెపోటు వచ్చే అవకాశాలు పెరుగుతాయి’’ అని అధ్యయనంలో పాలు పంచుకున్న లండన్‌లోని క్వీన్‌ మేరీ యూనివర్సిటీకి చెందిన డాక్టర్‌ జహ్రా అన్నారు.


ఈ అధ్యయనంలో భాగంగా  గుండె పనితీరును మూడు రకాలుగా విశ్లేషించారు. మొదటిది గుండె రక్తనాళాల్లో పంపింగ్‌ సామర్థ్యం, రెండోది గుండె కండరాల ఆరోగ్యం, మూడోది గుండె రక్తనాళాల స్థితిస్థాపక శక్తి. ఈ విశ్లేషణ ఆధారంగా రెడ్‌మీట్‌కు, గుండె జబ్బులు వచ్చే అవకాశాలకు ఉన్న సంబంధాన్ని తేల్చారు. పరిశోధన వివరాలను యూరోపియన్‌ సొసైటీ ఆఫ్‌ కార్డియాలజీకి చెందిన ఈఎస్‌సీ ప్రివెంటివ్‌ కార్డియాలజీ 2021లో ప్రదర్శించారు.


Updated Date - 2021-04-18T05:30:00+05:30 IST