పిల్లలను బెదిరిస్తున్నారా?

ABN , First Publish Date - 2021-04-10T05:30:00+05:30 IST

ఏదో ఒక సందర్భంలో పిల్లలను బెదిరించని తల్లితండ్రులు ఉండరు. ఆ బెదిరింపు చిన్నదైనా, పెద్దదైనా దాంతో లాభం కంటే నష్టాలే ఎక్కువ. అవేంటంటే...

పిల్లలను బెదిరిస్తున్నారా?

ఏదో ఒక సందర్భంలో పిల్లలను బెదిరించని తల్లితండ్రులు ఉండరు. ఆ బెదిరింపు చిన్నదైనా, పెద్దదైనా దాంతో లాభం కంటే నష్టాలే ఎక్కువ. అవేంటంటే...

  • పిల్లలు పెద్దల అదుపాజ్ఞల్లో ఉన్నప్పుడే బెదిరింపులు పని చేస్తాయి. ఒకసారి పిల్లలు ఇండిపెండెంట్‌గా తయారయితే, ఆ బెదిరింపులు వారి మీద ఎటువంటి ప్రభావాన్నీ చూపలేవు.
  • బెదిరింపులు దీర్ఘకాలంలో తల్లితండ్రులు పిల్లలకూ మధ్య అనుబంధాన్ని పలుచన చేస్తాయి.
  • పరిమితి దాటిన తర్వాత బెదిరింపులు విలువ కోల్పోతాయి. ప్రతి చిన్న విషయానికీ బెదిరిస్తూ పోతే, పిల్లలు వాటిని లక్ష్య పెట్టని పరిస్థితి వస్తుంది.
  • ప్రత్నామ్నాయాలు ఇవే! - ‘పాఠం నేర్చుకోకపోతే, వీపు పగులుతుంది’ అని బెదిరించే బదులు, ‘నచ్చిన 
  • బ్రేక్‌ఫాస్ట్‌ చేసి పెడతాను’ అనవచ్చు. ఇలా పాజిటివ్‌గా పిల్లలను ప్రేరేపించడం నేర్చుకోవాలి.
  • పిల్లల పనుల్లో తప్పులు దొర్లడం సహజం. ఆ తప్పుల నుంచే నేర్చుకుంటారు. కాబట్టి ‘తప్పు దొర్లితే నీ భరతం పడతా!’ అని బెదిరించే బదులు ‘తప్పు దొర్లకుండా పని చేయడానికి ప్రయత్నించు, నువ్వు చేయగలవు’... అంటూ వారిని ప్రోత్సహించాలి.
  • కొన్ని పనుల్లో పిల్లలకు పెద్దల సహాయం అవసరం పడవచ్చు. అలాంటి సందర్భాల్లో ‘ఇది నీ పని, నువ్వే చేయాలి’ అనే ధోరణిలో ఆధిపత్యం 
  • చెలాయించకుండా... ‘మనం కలిసి ముగిద్దాం’ అంటూ ఎంతోకొంత సహాయపడాలి.    

Updated Date - 2021-04-10T05:30:00+05:30 IST