బియ్యం పట్టుకున్నందుకు బెదిరింపులు

ABN , First Publish Date - 2020-09-24T14:34:55+05:30 IST

పేదలకు అందాల్సిన చౌక బియ్యాన్ని అక్రమంగా తరలిస్తున్నారు. దానిని అడ్డుకున్నందుకు..

బియ్యం పట్టుకున్నందుకు బెదిరింపులు

అక్రమార్కులను వదిలేసి ఆపై ఇబ్బంది

సీఎస్‌డీటీకి అడ్డం తిరిగిన దుర్గి పోలీసులు 

80 క్వింటాళ్ల రేషన్‌ బియ్యం వదిలేసిన వైనం


గుంటూరు(ఆంధ్రజ్యోతి): పేదలకు అందాల్సిన చౌక బియ్యాన్ని అక్రమంగా తరలిస్తున్నారు. దానిని అడ్డుకున్నందుకు అభినందించాలి.. లేదంటే కనీసం కేసు పెట్టాలి. కాని జిల్లాలో మా త్రం అందుకు పూర్తి విరుద్ధంగా చౌక బి య్యాన్ని పట్టుకున్న సీఎస్‌డీటీకే బెదిరిం పులు వచ్చాయి. అసలు నీవు ఎవరూ.. నీకు ఏ అధికారం ఉంది.. నీ గుర్తింపు కార్డు ఏది అంటూ ఏకంగా పోలీసులే అడ్డం తిరిగారు.


అక్రమాలను అడ్డుకోవా ల్సిన పోలీసులు అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తుండటంపై రెవెన్యూవర్గాలతో పాటు ప్రజలు కూడా విస్మయం వ్యక్తం చేస్తున్నారు. పౌరసరఫరాల చట్టం ప్రకా రం రేషన్‌ సరుకులు అక్రమంగా తరలి స్తుంటే సీజ్‌ చేసి సంబంధిత వ్యక్తులపై 6ఏ సెక్షన్‌ కింద కేసు నమోదు చేసే అధి కారం సీఎస్‌డీటీలది.  పోలీసులు దాడులు నిర్వహించి రేషన్‌ సరుకులను పట్టుకున్నా వారిపై క్రిమినల్‌ కేసులు నమోదు చేస్తా రు. అదే సమయంలో పౌరసరఫరాల శాఖ అధికారుల ద్వారా 6ఏ కేసు పెట్టిస్తారు.


ఇలా ఈ రెండు శాఖల అధికారులు సమ న్వయంతో పని చేస్తూ అక్రమంగా తరలిం చే రేషన్‌ సరుకులను అరికడుతుంటారు. అలాంటిది దుర్గిలో మంగళవారం జరిగిన సంఘటనతో రెవెన్యూవర్గాలు ఆందోళనకు గురయ్యాయి. పోలీసుయాక్టు ప్రకారం నడుచుకోవాల్సిన పోలీసులు అందుకు విరుద్ధంగా ప్రజాప్రతినిధులు ఏమి చెబితే దానిని పాటిస్తోన్నారనే విమర్శలు వస్తు న్నాయి. అక్రమార్కులను వదిలేసి ప్రభు త్వ ఉద్యోగులనే ఇబ్బంది పెట్టే స్థాయికి చేరడంపై రెవెన్యూ వర్గాలు ఆందోళన చెం దుతున్నాయి.   అక్రమంగా రేషన్‌ బియ్యా న్ని తరలిస్తోన్న వ్యక్తులు, ఆటోని అక్కడి పౌరసరఫరాల శాఖ అధికారి పట్టుకుంటే నిబంధనల ప్రకారం కేసు నమోదు చేయా ల్సిందిపోయి ఆ అధికారినే అక్కడి పోలీసు లు ఇబ్బంది పెట్టారు.


రేషన్‌ బియ్యాన్ని త రలిస్తోన్న వ్యక్తులను సీఎస్‌డీటీ పట్టు కుం టే ఆయనకు అండగా నిలిచి వారి తరుపున కూడా క్రిమినల్‌ కేసు పెట్టాల్సింది పోయి అందుకు విరుద్ధంగా వ్యవహరించారు. ఒక్క ఫోన్‌కాల్‌తో వారు తరలిస్తోన్న 80 క్వింటాళ్ల బియ్యాన్ని, ఆటోను, వ్య క్తులను వదిలేశారు. ఈ నేపథ్యంలో దుర్గి పోలీసుల ఉదంతంపై రూరల్‌ ఎస్పీ ఏ వి ధంగా స్పందిస్తారోనన్న ఉత్కంఠ నెలకొన్నది. 

Updated Date - 2020-09-24T14:34:55+05:30 IST