చోరీ కేసులో ముగ్గురు నిందితుల అరెస్ట్‌

ABN , First Publish Date - 2021-03-05T05:54:08+05:30 IST

ల్లాలోని పలు చోట్ల చోరీకి పాల్పడు తున్న ముగ్గురు నిందితులను పోలీసులు గురువారం అరెస్టు చేశారు.

చోరీ కేసులో ముగ్గురు నిందితుల అరెస్ట్‌
వివరాలు వెల్లడిస్తున్న డీఎస్పీ

ఫబంగారం, నగదు స్వాధీనం ఫవివరాలు వెల్లడించిన జగిత్యాల డీఎస్పీ వెంకటరమణ

జగిత్యాల రూరల్‌, మార్చి 4 : జిల్లాలోని పలు చోట్ల చోరీకి పాల్పడు తున్న ముగ్గురు నిందితులను పోలీసులు గురువారం అరెస్టు చేశారు. వారి వద్ద నుంచిచోరీ సొత్తును స్వాధీనం చేసుకున్నట్లు జగిత్యాల డీ ఎస్పీ వెంకటరమణ తెలిపారు. గురువారం జగిత్యాల రూరల్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు డీఎస్పీ వెల్లడించారు. ఈ సందర్బంగా డీఎస్పీ మాట్లాడుతూ గురువారం జగి త్యాల రూరల్‌ పోలీసులు వాహనాలు తనిఖీ చేస్తుండగా అర్బన్‌ మం డలం తిప్పన్నపేట ఎక్స్‌రోడ్‌ వద్ద ప్రధాన నిందితుడు ధర్మాజీ గణేష్‌ తాను దొంగిలించిన హెచ్‌ఎఫ్‌ డీలక్స్‌ వాహనంపై వస్తుండగా పోలీసు లు పట్టుకున్నారని తెలిపారు. నిందితున్ని విచారించగా పలు చోట్ల దొంగతనాలకు పాత్పడినట్లు ఒప్పుకున్నారని తెలిపారు. వెల్గటూర్‌ మం డల కేంద్రంలో టైర్‌ పంక్చర్‌ షాప్‌ నడుపుకుంటున్న గణేష్‌ వచ్చే డ బ్బులతో జల్సాలకు అలవాటు పడ్డాడు. దీంతో డబ్బులు సరిపోక దొం గతనాలకు అలవాటుపడ్డారు. 

అతని స్నేహితుడైన బుగ్గారం మండలం బీరుసాని గ్రామానికి చెం దిన గుమ్ముల వెంకటేష్‌తో కలిసి కల్లెడ గ్రామంలో అంకతి గంగవ్వ ఇంట్లో బంగారం అపహరించారు. అదే విధంగా గుల్లపేట గ్రామానికి చెందిన చిందం మురళితో పాటు అతని తమ్ముడి ఇంట్లో బంగారం, వెండి ఇతర సామగ్రి దొంగిలించారు. జగిత్యాల పట్టణంలోని చిన్నకె నాల్‌ వద్ద రోడ్డు పక్కన ఆపి ఉంచిన హెచ్‌ఎఫ్‌ డీలక్స్‌ వాహనాన్ని, ధ ర్మపురి పట్టణంలో నల్లెల మణిదీప్‌ ఇంట్లో 5 తులాల బంగారు ఆభర ణాలు, నేరెళ్ల గ్రామంలో మేడిపెళ్లి వెంకటేష్‌ ఇంట్లో 20 వేల నగదు ఎ త్తుకెళ్లారు. వీరిద్దరితో పాటు దండెపల్లి మండలం గూడెం గ్రామానికి చెందిన తాండ్ర ప్రదీప్‌, తాండ్ర రాజశేఖర్‌లతో కలిసి గొల్లపల్లి మండ లం శ్రీరాముల పల్లె గ్రామంలో దుంపేట లావణ్య ఇంట్లో బంగారం, వెండి, ఆభరణాలు టీవీ, సెల్‌పోన్‌లు ఎత్తుకెళ్లారు. ప్రధాన నిందితుడు గణేష్‌తో పాటు ప్రదీప్‌, రాజశేఖర్లు పట్టుబడగా గుమ్ముల వెంకటేష్‌ ప రారీలో ఉన్నట్లు డీఎస్పీ వెంకటరమణ తెలిపారు. నిందితుల నుం చి3,23,300ల విలువైన బంగారు ఆభరణాలు, ద్విచక్రవాహనం, 4 టై ర్లు ఇతర చోరీ సొత్తును స్వాధీనం చేసుకున్నారు. నిందితులను అరెస్ట్‌ చేయడంలో కీలక పాత్ర పోషించిన జగిత్యాల రూరల్‌ పోలీసులు, సీసీ ఎస్‌ పోలీసులను డీఎస్పీ అభినందించారు. ఈ కార్యక్రమంలో రూరల్‌ సీఐ కృష్ణ కుమార్‌, సీసీఎస్‌ సీఐ అరీప్‌ అలీఖాన్‌, రూరల్‌ఎస్సై చిరం జీవి పాల్గొన్నారు.

Updated Date - 2021-03-05T05:54:08+05:30 IST