నాటు తుపాకీ విక్రయం.. ముగ్గురి అరెస్టు

ABN , First Publish Date - 2020-05-28T16:02:45+05:30 IST

ఎస్పీ ఉత్తర్వులతో వేలూరు జిల్లా క్యూ బ్రాంచి డీఎస్పీ రవీంద్రన్‌ నేతృత్వంలో

నాటు తుపాకీ విక్రయం.. ముగ్గురి అరెస్టు

చెన్నై : రాణిపేట జిల్లా ఆర్కాడు సమీపం చెన్నై- బెంగుళూరు జాతీయ రహదారిలో నాటు తుపాకీ విక్రయం జరుగుతున్నట్టు జిల్లా ఎస్పీ మయిల్‌వాహనంకు సమాచారం అందింది. ఎస్పీ ఉత్తర్వులతో వేలూరు జిల్లా క్యూ బ్రాంచి డీఎస్పీ రవీంద్రన్‌ నేతృత్వంలో పోలీసులు మంగళవారం రాత్రి ఆర్కాడులో తనిఖీ చేశారు. ఆ సమయంలో వచ్చిన కారును అడ్డుకొనేందుకు యత్నించగా ఆగకుండా వేగంగా వెళ్లిపోయింది, దీంతో పోలీసులు మరో వాహనంలో కారును వెంటాడి వాలాజాపేట టోల్‌గేట్‌ వద్ద అడ్డుకున్నారు.


కారులో ఉన్న వారిని విచారించగా... వారు కాంచీపురం జిల్లా సెన్‌గాడుకు చెందిన  రౌడీలు రాము (29), పూర్ణచంద్రన్‌ (20) అని, వారు ఎవరినో హత్య చేసేందుకు నకిలీ తుపాకీ కొనుగోలు చేసినట్టు తెలిసింది. దీంతో ఇద్దరిని అరెస్టు చేసిన పోలీసులు, వారి నుంచి నాటు తుపాకీని స్వాధీనం చేసుకున్నారు. వీరికి తుపాకీ విక్రయించిన వేలూరు జిల్లాకు చెందిన తమిళగ మక్కల్‌ మున్నేట్ర కళగం జిల్లా సెక్రటరీ దేవాను బుధవారం ఉదయం పోలీసులు అరెస్టు చేశారు.

Updated Date - 2020-05-28T16:02:45+05:30 IST