Abn logo
Sep 20 2021 @ 07:04AM

Mumbai: నిమజ్జనంలో అపశ్రుతి, సముద్రంలో ముగ్గురు బాలురు గల్లంతు

ముంబై (మహారాష్ట్ర): మహారాష్ట్రలోని ముంబై నగరంలో గణేశ్ నిమజ్జనోత్సవంలో అపశ్రుతి చోటుచేసుకుంది.ముంబైలోని వెర్సోవా సముద్రతీరంలో జరిగిన వినాయక నిమజ్జనం సందర్భంగా ఐదుగురు బాలురు నీటిలో మునిగారు.సముద్రంలో మునిగిన వారిలో ఇద్దరిని స్థానికులు కాపాడి ముంబైలోని కూపర్ ఆసుపత్రికి తరలించారు. సముద్రంలో నిమజ్జనం సందర్భంగా గల్లంతైన ముగ్గురు బాలుర కోసం ముంబై అగ్నిమాపక శాఖ అధికారులు గాలిస్తున్నారు. గల్లంతైన బాలుర కోసం గాలించేందుకు పోలీసు బోటుతోపాటు నేవి సిబ్బందిని రంగంలోకి దించామని ముంబై చీఫ్ ఫైర్ ఆఫీసర్ చెప్పారు.


నాలుగు రాష్ట్రాల్లో 19 మంది దుర్మరణం

నాలుగు రాష్ట్రాల్లో గణేశ్ నిమజ్జనం సందర్భంగా జరిగిన ప్రమాద ఘటనల్లో 19 మంది దుర్మరణం చెందారు. మధ్యప్రదేశ్ రాష్ట్రంలో 8 మంది, యూపీలో 5, రాజస్థాన్ లో ఇద్దరు, మహారాష్ట్రలో నలుగురు మరణించారు.యూపీలోని బారాబంకీ జిల్లాలోని కల్యాణి నదిలో నిమజ్జనం సందర్భంగా ఓ మహిళ, ఇద్దరు పిల్లలు నీటిలో మునిగారు. మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని భిండీ జిల్లాలో నిమజ్జనం సందర్భంగా నలుగురు పిల్లలు మరణించారు. రాజస్థాన్ రాష్ట్రంలోని అజ్మీర్ జిల్లాలో చెరువులో ఇద్దరు మునిగి మృత్యువాత పడ్డారు.


ఇవి కూడా చదవండిImage Caption