మూడు రాజధానులు.. రాజ్యాంగ ధిక్కరణే!

ABN , First Publish Date - 2020-11-28T08:56:35+05:30 IST

దేశంలో ఏ రాష్ట్రంలోనూ లేనివిధంగా రాష్ట్ర ప్రభుత్వం తలపెట్టిన 3 రాజధానుల ఏర్పాటు అంశాన్ని రాజ్యాంగం అనుమతించదని, అది రాజ్యాంగ ధిక్కరణ కిందకే వస్తుందని సీనియ ర్‌ న్యాయవాది ఎ.సత్యప్రసాద్‌ హైకోర్టుకు తెలిపారు. ఏ రాష్ట్ర విభజన చట్టంలోనూ

మూడు రాజధానులు.. రాజ్యాంగ ధిక్కరణే!

సీనియర్‌ న్యాయవాది సత్యప్రసాద్‌ స్పష్టీకరణ


అమరావతి, నవంబరు 27(ఆంధ్రజ్యోతి): దేశంలో ఏ రాష్ట్రంలోనూ లేనివిధంగా రాష్ట్ర ప్రభుత్వం తలపెట్టిన 3 రాజధానుల ఏర్పాటు అంశాన్ని రాజ్యాంగం అనుమతించదని, అది రాజ్యాంగ ధిక్కరణ కిందకే వస్తుందని సీనియ ర్‌ న్యాయవాది ఎ.సత్యప్రసాద్‌ హైకోర్టుకు తెలిపారు. ఏ రాష్ట్ర విభజన చట్టంలోనూ లేనట్లుగా ఏపీ విభజన చట్టంలో రూపొందించిన ‘సెక్షన్‌ 6’ మేరకు రాజధాని ఏర్పాటు బాధ్యత కేంద్రం తీసుకుందని, ఆ మేరకే ఏర్పాటైన కమిటీ చేసి న సిఫారసుల మేరకు రాజధాని ఏర్పాటైంద న్నారు. రాజధానికి సంబంధించిన పిటిషన్లపై హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ జేకే మహేశ్వరి, న్యాయమూర్తులు జస్టిస్‌ ఎం.సత్యనారాయణమూర్తి, జస్టిస్‌ ఎన్‌.జయసూర్యతో కూడిన త్రిసభ్య ధర్మాసనం రోజువారీ తుదివిచారణ చేపడుతున్న విషయం తెలిసిందే. ఇం దులో భాగంగా శుక్రవారం మాజీ మంత్రి పితా ని సత్యనారాయణ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ జరిగింది. ఆయన తరఫున సత్యప్రసాద్‌ వాదనలు వినిపించారు.


హైదరాబాద్‌ లాంటి నగరమే ఇక్కడా..

ఆంధ్ర, సీమ ప్రాంతాల నుంచి వెళ్లిన ఎంతోమంది హైదరాబాద్‌ అభివృద్ధికి ఎంతో చెమటోడ్చారని.. సత్యప్రసాద్‌ తెలిపారు. ‘హైదరాబాద్‌ లాంటి నగరాన్ని ఏపీలో కూడా ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరముంది. ఆదాయం సమకూర్చే రాజధాని కావాలి. అందుకోసమే శివరామకృష్ణన్‌ కమిటీ అధ్యయనం చేసి 3 ప్రత్యామ్నాయాలు ఇచ్చింది. గ్రీన్‌ఫీల్డ్‌ రాజధాని ఏర్పాటు లేదా, ఇప్పటికే ఉన్న నగరాన్ని అభివృద్ధి చేసుకోవడం, లేదా రాష్ట్రవ్యాప్తంగా కార్యాలయాలను తరలించడం వంటివి ఇచ్చింది. దీంతో అప్పటి రాష్ట్ర కేబినెట్‌ గ్రీన్‌ఫీల్డ్‌ రాజధాని ఏర్పాటుకు మొగ్గు చూపి, ఆమోదించింది. శివరామకృష్ణన్‌ కమిటీ ఇచ్చిన నివేదికను రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించి, ఆ మే రకు అమరావతిని రాజధానిగా నిర్ణయించాక.. దానిని మళ్లీ మార్చడానికిగానీ, ఈ విషయంలో పునఃపరిశీలన జరపడానికిగానీ వీల్లేదు. ప్రభుత్వం అంటే చంద్రబాబో, జగన్మోహన్‌రెడ్డో కాదు. అది నిరంతరం కొనసాగే యంత్రాంగం. అసెంబ్లీ ఆమోదించి, అమరావతిని రాజధానిని ప్రకటించింది. పార్లమెంటు నిర్ణయం మేరకు జరిగిన ఈ నిర్ణయానికి విరుద్ధంగా 3 రాజధానుల నిర్ణయం తీసుకోజాలరు’ అన్నారు.


అమరావతి నిర్మాణం ఇలా..

అమరావతి పురోగతికి సంబంధించి 2016-19 మధ్య రాష్ట్రప్రభుత్వం రూపొందించిన నివేదికల్లోనూ వివరాలు ఉన్నాయని సత్యప్రసాద్‌ తెలిపారు. అమరావతిని ఎలా గుర్తించా రు.. ప్రణాళికలు ఏంటి.. హైకోర్టు, అసెంబ్లీ తదితర భవన నిర్మాణాలు ఎలా జరిగాయి వంటి వివరాలన్నీ వాటిలో పొందుపరిచారని వివరించారు. ‘రాజధాని కోసం భూ సమీకరణ జరిగింది. చుట్టుపక్కల ప్రాంతాలు అభివృద్ధి చెందాయి. రాజధాని నిర్మా ణం కోసం కోట్లాది రూపాయ లు ఖర్చు చేశారు. అన్ని వర్గాలకు రాజధాని సమాంతర దూరంలో ఉండేలా నిర్ణయం తీసుకున్నారు. ఇప్పుడు 3 రాజధానుల అంశం తీసుకురావడం రాజ్యాంగ విరుద్ధం. ఎక్కడైనా రాష్ట్రానికి రాజధాని ఒక్కటే ఉంటుంది. రాష్ట్ర రాజధాని నుంచే అన్ని కార్యకలాపాలు జరుగుతాయి. అసెంబ్లీ, సచివాలయం, హైకోర్టు  అన్నీ రాష్ట్రంలో అంతర్భాగమే. ఇవన్నీ ఒకే కేటగిరీ కిందకు వస్తాయి. అంతేతప్ప న్యాయ రాజధాని, శాసన రాజధాని, పాలనా రాజధాని అంటూ వే ర్వేరుగా ఉండవు. అసలు వీ టికి ఈ పేర్లు పెట్టడమే అ నుమతించతగిన విషయం కాదు. రాజ్యాంగంలో అలాంటి రాజధానుల ప్రస్తావనే లే దు. రాష్ట్రం ఈ మూడు విభాగాలపైనే నడుస్తుంది. ఈ మూడు విభాగాలు మూడు చోట్ల ఉండడానికి వీల్లేదు. దీనిని రాజ్యాంగం అనుమతించదు. మూడు రాజధాను ల అంశం పూర్తిగా తప్పుడు నిర్ణయం’ అని స్పష్టం చేశారు.  కొన్ని రాష్ట్రాల్లో కొన్ని చారిత్రక నిర్ణయాలతో హైకోర్టులు మాత్రం రాజధానిలో కాకుండా వేరే ప్రాంతాల్లో ఉన్నాయని తెలిపారు. మిగిలిన పిటిషనర్ల తరఫు న్యాయవాదుల వాదనల కోసం తదుపరి విచారణను ధర్మాసనం సోమవారానికి వాయిదా వేసింది.

Updated Date - 2020-11-28T08:56:35+05:30 IST