మహిళతో అసభ్యకర Chat: ముగ్గురు పోలీసులు ఔట్

ABN , First Publish Date - 2021-10-13T17:49:04+05:30 IST

ఓ మహిళతో ఫోన్ లో అసభ్యంగా సంభాషించినందుకు ముగ్గురు పోలీసులపై సస్పెన్షన్ వేటు పడిన ఘటన...

మహిళతో అసభ్యకర Chat: ముగ్గురు పోలీసులు ఔట్

భోపాల్ (మధ్యప్రదేశ్): ఓ మహిళతో ఫోన్ లో అసభ్యంగా సంభాషించినందుకు ముగ్గురు పోలీసులపై సస్పెన్షన్ వేటు పడిన ఘటన మధ్యప్రదేశ్ రాష్ట్రంలో సంచలనం రేపింది. ఓ మహిళతో ఫోన్‌లో అసభ్యకరంగా సంభాషించారనే ఫిర్యాదుపై సబ్ ఇన్‌స్పెక్టరుతో సహా ముగ్గురు పోలీసులను సస్పెండ్ చేసిన ఘటన బేతుల్ జిల్లాలో వెలుగుచూసింది. తన భార్యతో ముగ్గురు పోలీసులు అసభ్యంగా, అభ్యంతరకరంగా ఫోనులో మాట్లాడారని భర్త బేతుల్ జిల్లా ఎస్పీ సిమాల ప్రసాద్ కు ఫిర్యాదు చేశారు. దీంతో ఎస్పీ ఈ ఘటనపై సీనియర్ పోలీసు అధికారితో దర్యాప్తు జరిపించారు. 



భార్యతో పోలీసులు అసభ్యంగా మాట్లాడిన ఘటన తర్వాత భార్యభర్తల మధ్య గొడవలకు దారి తీసింది. మహిళతో ఫోన్ లో సబ్ ఇన్‌స్పెక్టర్ అమిత్ పవార్, హెడ్ కానిస్టేబుల్ బలరామ్ సర్యమ్, కానిస్టేబుల్ ఆదిత్య బెలేలు అసభ్యంగా మాట్లాడారని దర్యాప్తులో తేలడంతో వారిని సస్పెండ్ చేసినట్లు జిల్లా ఎస్పీ సిమాల ప్రసాద్ చెప్పారు. సస్పెండైన ముగ్గురు పోలీసులను బేతుల్ లోని పోలీసు రక్షిత కేంద్రానికి అటాచ్ చేస్తూ ఎస్పీ ఉత్తర్వులు జారీ చేశారు. 

Updated Date - 2021-10-13T17:49:04+05:30 IST