ఇంతింతై.. మూడుంతలై!

ABN , First Publish Date - 2020-09-19T05:30:00+05:30 IST

అల్లం, తీపి మొక్కజొన్న, టమాటా.. వీటిల్లో ఒకటి దుంప, మరొకటి కూరగాయ, ఇంకోటి ఆహారధాన్యపు పంట! వీటిల్లో ఏ ఒక్కదానికి

ఇంతింతై.. మూడుంతలై!

ఎకరం భూమిలో మూడు పంటలు  అల్లం, తీపిమొక్కజొన్న, టమాటా సాగుతో లాభాలు

కేరళ నుంచి అల్లం దుంపల సేకరణ ఆదర్శంగా నిలుస్తున్న రైతు శ్రీనివాస్‌


రఘునాథపాలెం సెప్టెంబరు 18: అల్లం, తీపి మొక్కజొన్న, టమాటా.. వీటిల్లో ఒకటి దుంప, మరొకటి కూరగాయ, ఇంకోటి ఆహారధాన్యపు పంట! వీటిల్లో ఏ ఒక్కదానికి ఇంకోదానితో సంబంధం ఉండదు. వీటి కుటుంబాలు వేరు. జన్యుక్రమం పూర్తిగా వేరు. కానీ చెట్టుమీద ఉసిరిని, సముద్రంలో ఉప్పుని, చేలోని మిరపకాయను కలిసి ఊరగాయ చేసినట్టు.. ఎక్కడో కేరళలో పండే అల్లాన్ని, శీతల ప్రాంతాల్లో లభించే తీపి మొక్కజొన్నను, హరితపందిళ్లల్లో మాత్రమే సాగయ్యే టమాటాను ఒకే చేలో సాగు చేయడం సాధ్య మా? అది కూడా అంతరపంటగా.. చదువుతుంటేనే ఆశ్చర్యం కలుగుతోంది కదూ! ఇలాంటి అసాధ్యాన్ని సుసాధ్యం చేసి లాభాల సేద్యం చేస్తున్నాడు రఘునాథపాలెం మండలం రాంక్యా తండాకు చెందిన గుగులోత్‌ శ్రీనివాసరావు.


వైవిధ్యంగా ఆలోచించి..

అధికారులు పంటమార్పిడి చేయాలని, వాణిజ్యపంటలే కాకుండా వైవిధ్యభరితమైన సాగు చేపట్టాలని ప్రభుత్వం చెబుతున్నా రైతులు అంతగా పట్టించుకుంటున్న దాఖలా లు లేవు. ఈక్రమంలో మండలంలోని రాంక్యాతండాకు చెందిన యువరైతు గుగులోత్‌ శ్రీనివాస్‌ అల్లం సాగును చేపట్టాడు. తల్లిదండ్రులు పూర్వం నుంచి వాణిజ్య పంటలనే సాగుచేస్తుండేవారు. ఆ వ్యవసాయంలో ఉండే లాభ నష్టాల గురించి తెలుసుకున్న యువరైతు వైవి ధ్యంగా ఆలోచించి అల్లం వైపు మళ్లాడు. పంటకాలం ఆరు మాసాలే కావడంతో అంతరపంటగా తీపి మొక్కజొన్న, టమాటను సాగు చేశాడు. ఒక్క ఎకరంలో మూడు రకాల పంటలను సాగు చేయడమే కాదు లాభాలూ గడిస్తు న్నాడు.


కేరళ నుంచి దుంపలు..

కేరళ నుంచి ప్రత్యేకంగా మహిన్‌, మారన్‌ అనే రెండు రకాల అల్లం దుంపలను తెప్పించి సాగు చేస్తున్నాడు. ఎకరాకు రూ.1.50 లక్షలు ఖర్చు చేశాడు.. దిగుబడి ఎకరాకు 80 నుంచి 100 క్వింటాళ్ల వస్తుందని శ్రీనివాస్‌ పేర్కొంటున్నాడు. ప్రస్తుతం అల్లం క్వింటాకు రూ.ఆరువేల ధర ఉంది. సుమారు ఆరు మాసాల్లో ఐదు నుంచి రూ. ఆరులక్షల లాభం వస్తుందని రైతు అంటున్నాడు. ఈక్ర మంలో జిల్లా అసిస్టెంట్‌ కలెక్టర్‌ వరుణ్‌రెడ్డి అల్లంసాగును పరిశీలించారు. ఈసందర్భంగా ఇలాంటి పంటలను సాగుచేసే రైతులకు ఉద్యానశాఖ నుంచి ప్రోత్సాహం అందించాలని సూచించారు. జిల్లా వ్యాప్తంగా రైతుల్లో అవగాహన కల్పించాలని అధికారులకు సూచించారు. 


దూరవిద్య కేంద్రం నుంచి సాగుబాట...

కరోనా చాలా మంది జీవితాలను మార్చింది. యువరైతు గుగులోత్‌ శ్రీనివాసరావు ఎమ్మెస్సీ బీఈడీ చేసి దూరవిద్యకేంద్రాన్ని నిర్వహిస్తున్నాడు. కరోనా ప్రభావంతో విద్యాసంవత్సరం నడిచే పరిస్థితి లేకపో వడంతో వ్యవసాయబాట పట్టాడు. ఇలా ఎంతో మంది విద్యావం తులు వ్యవసాయం బాట పట్టారు. అందరికంటే భిన్నంగా శ్రీనివాసరావు అల్లం సాగు చేపట్టి శభాష్‌ అనిపించు కుంటున్నాడు. సాగును కూడా సేంద్రియ పద్ధతిలో చేపడుతున్నాడు.


తక్కువ పెట్టుబడి అధిక లాభం..గుగులోత్‌ శ్రీనివాస్‌, యువరైతు

అల్లం సాగు తక్కువ పెట్టుబ డితో అధిక లాభాలు వస్తాయి. ఉద్యానశాఖ అధికారుల సూచన లతో పాటు, అల్లం సాగు చేపట్టిన అనుభవం ఉన్న రైతుల వీడి యోలను యూట్యూబ్‌లో చూశాను. వారు చేస్తున్న సేద్యం లో మెళకువలు తెలుసుకు న్నా ను. రసాయన ఎరువులతో కాకుండా సేంద్రియ పద్ధతిలో సాగుచేయటం ద్వారా నాణ్యమైన దిగుబడులు సాధించొచ్చు.

Updated Date - 2020-09-19T05:30:00+05:30 IST