వైద్య సిబ్బంది రక్షణకు 3డి ప్రింటెడ్‌ ఫేస్‌ షీల్డ్‌

ABN , First Publish Date - 2020-04-10T18:27:26+05:30 IST

కరోనా రోగులకు సేవ చేస్తున్న వైద్య సిబ్బంది రక్షణ కోసం హైదరాబాద్‌ బిట్స్‌ పిలానీ పరిశోధకులు 3డి ప్రింటెడ్‌ ఫేస్‌ షీల్డ్‌ను రూపొందించారు. తిరిగి వినియోగించుకునే

వైద్య సిబ్బంది రక్షణకు 3డి ప్రింటెడ్‌ ఫేస్‌ షీల్డ్‌

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 9: కరోనా రోగులకు సేవ చేస్తున్న వైద్య సిబ్బంది రక్షణ కోసం హైదరాబాద్‌ బిట్స్‌ పిలానీ పరిశోధకులు 3డి ప్రింటెడ్‌ ఫేస్‌ షీల్డ్‌ను రూపొందించారు. తిరిగి వినియోగించుకునే విధంగా పాలిలాక్టిక్‌ యాసిడ్‌ (పీఎల్‌ఏ)తో ఈ షీల్డ్‌ను తయారు చేశారు. 0.1 ఎంఎం మందం, ఏ4 సైజ్‌ ఉండే దీని ఖరీదు రూ.40 వరకు ఉంటుంది. 70-80 డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రత వద్ద బాయిల్డ్‌ చేస్తే ఏ వైరస్‌ అయినా చనిపోతుంది. ఈ షీల్డ్‌ 200 డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రతను తట్టుకోగలదు. ఉపయోగించే ముందు ఈ షీల్డ్‌ను ఒకసారి బాయిల్‌ చేయాల్సి ఉంటుంది.


దీని తయారికి వాడే పీఎల్‌ఏ మార్కెట్లో సులువుగా లభిస్తుంది. కిలో రూ.900. ఈ షీల్డ్‌ రూపకల్పనలో 40 గ్రాముల పీఎల్‌ఏ, రూ. 5 విలువ చేసే ఒక లామినేషన్‌ షీట్‌ అవసరమవుతుంది. దీనిని ప్రింట్‌ చేయడానికి మూడు గంటల సమయం పడుతుంది. అదే హై ఎండ్‌ ప్రింటర్‌ను వినియోగిేస్త 15 నిమిషాల్లో వీటిని ప్రింట్‌ చేయవచ్చు. ప్రస్తుతం ఉన్న షీల్డ్‌ను ఉపయోగించడంలో పరిమితులు ఉన్నాయి కానీ మేము రూపొందించిన ఈ షీల్డ్‌ను ఎన్నిసార్లు అయినా వినియోగించుకోవచ్చు అని బిట్స్‌ పిలానీ స్కాలర్‌ అవినాష్‌ కొత్తూరు తెలిపారు.


Updated Date - 2020-04-10T18:27:26+05:30 IST