Abn logo
Aug 1 2021 @ 21:50PM

విషాదం.. : ఫ్రెండ్ షిప్ డే రోజు మద్యం మత్తులో...!

నిజామాబాద్ : ఫ్రెండ్ షిప్ డే రోజున నిజామాబాద్ జిల్లా నందిపేటలో విషాదం చోటుచేసుకుంది. ఇవాళ ఫ్రెండ్ షిప్ డే కావడంతో కొందరు యువకులు ఎంజాయ్ చేయాలని అనుకున్నారు. యువకులంతా మద్యం తాగి ఎంజాయ్ చేశారు. అంతటితో ఆగి ఇంటికెళ్లుంటే బాగుండేదేమో.. కానీ శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు బ్యాక్ వాటర్‌లో స్నానానికి వెళ్లారు. మద్యం మత్తులో ఉండటంతో ముగ్గురు యువకులు నీటమునిగి మృతిచెందారు. మొత్తం ఆరుమంది యువకులు విహారానికి వెళ్లగా అందులో ముగ్గురు మృతిచెందారు. సమాచారం అందుకుని స్థానికులు, పోలీసులు, గజ ఈతగాళ్లు ఘటనా స్థలానికి చేరుకుని ముగ్గురు యువకుల్ని ప్రాణాలతో కాపాడారు. ముగ్గురి మృతదేహాలను వెలికి తీశారు. మృతులు బూర్గుల రాహుల్(20), ఉదయ్ (19), గట్టు శివ(20) నిజామాబాద్ మండలం అర్సపల్లి గ్రామానికి చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. ఈ ఘటనతో అర్సపల్లిలో విషాదఛాయలు అలుముకున్నాయి.