బీఓఐ లాభంలో మూడింతల వృద్ధి

ABN , First Publish Date - 2020-08-04T06:13:29+05:30 IST

జూన్‌తో ముగిసిన తొలి త్రైమాసికంలో బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (బీఓఐ) నికర లాభం ఏకంగా మూడింతలు వృద్ధి చెంది రూ.843.60 కోట్లుగా నమోదైంది

బీఓఐ లాభంలో మూడింతల వృద్ధి

న్యూఢిల్లీ: జూన్‌తో ముగిసిన తొలి త్రైమాసికంలో బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (బీఓఐ) నికర లాభం ఏకంగా మూడింతలు వృద్ధి చెంది రూ.843.60 కోట్లుగా నమోదైంది. మొండి బకాయిల ఒత్తిడి గణనీయంగా తగ్గటమే లాభం పెరగటానికి కారణంగా ఉంది. గత ఏడా ది ఇదే త్రైమాసికంలో బ్యాంక్‌ నికర లాభం రూ.242.60 కోట్లుగా ఉంది. త్రైమాసిక సమీక్షా కాలంలో మొత్తం ఆదాయం కూడా 11,526.95 కోట్ల నుంచి రూ.11,941.52 కోట్లకు పెరిగింది. ఈ కాలంలో స్థూల మొండి బకాయిలు 16.50 శాతం నుంచి 13.91 శాతానికి, నికర ఎన్‌పీఏ 5.79 శాతం నుంచి 3.58 శాతానికి తగ్గాయి.

Updated Date - 2020-08-04T06:13:29+05:30 IST