Advertisement
Advertisement
Abn logo
Advertisement

ముగ్గురు భారతీయ సంతతి వ్యక్తులకు బంపర్ ఆఫర్.. ఏకంగా శ్వేతసౌధంలోనే..

ఇంటర్నెట్ డెస్క్: అగ్రరాజ్యాధినేత అధికారిక నివాసం వైట్‌హౌన్‌..  సోమవారం 19 మంది యువతరం నాయకులకు ఫెలోషిప్ అవకాశాన్ని కల్పించింది. ముగ్గురు భారతీయ సంతతి వ్యక్తులు కూడా ఈ బంపర్ ఆఫర్ కొట్టేశారు. ఈ ఫెలోషిప్ ప్రోగ్రాంలో భాగంగా వివిధ రంగాల్లోని నిపుణులకు శ్వేతసౌధంలో ఫెలోగా పని చేసేందుకు అక్కడి ప్రభుత్వం అవకాశమిస్తుంది. ఈ అవకాశం పొందిన వారు ప్రభుత్వం నుంచి కొంత వేతనంతో పాటూ వైట్‌హౌస్‌లోని ముఖ్య విభాగాల్లో క్యాబినెట్ సెక్రెటరీలుగా, ఇతర కీలక అధికారులుగా పని చేస్తూ వృత్తిపరంగా అమూల్యమైన అనుభవాన్ని గడిస్తారు. ఏడాది పాటు వీరు శ్వేతసౌధంలో సేవలందిస్తారు. కాగా.. ఈ ఏడాది కాలిఫోర్నియాకు చెందిన జాయ్ బసూ, సన్నీ పటేల్, న్యూజెర్సీకి చెందిన ఆకాశ్ షా ఈ అద్భుత అవకాశాన్ని సొంతం చేసుకున్నారు.  వైట్ హౌస్‌లోని జెండర్ పాలసీ కౌన్సిల్‌లో జాయ్ బసూ సేవలందించనున్నారు. దేశ అంతర్గత భద్రతా విభాగంలో సన్నీ పటేల్ నియమితులయ్యారు. ఆకాశ్ షాకు వైద్య సేవల విభాగంలో అవకాశం లభించింది.  

Advertisement

తాజా వార్తలుమరిన్ని...

Advertisement