నేపాల్ వరదల్లో ముగ్గురు భారతీయుల అదృశ్యం

ABN , First Publish Date - 2021-06-17T17:52:58+05:30 IST

సెంట్రల్ నేపాల్‌లో పెద్ద ఎత్తున వర్షాలు కురుస్తుండటంతో అకస్మాత్తుగా

నేపాల్ వరదల్లో ముగ్గురు భారతీయుల అదృశ్యం

ఖాట్మండు : సెంట్రల్ నేపాల్‌లో పెద్ద ఎత్తున వర్షాలు కురుస్తుండటంతో అకస్మాత్తుగా వరదలు వచ్చాయి. సింధుపల్చోక్ జిల్లాలో సంభవించిన వరదల్లో 20 మంది అదృశ్యమయ్యారని, వీరిలో ముగ్గురు భారతీయులని నేపాల్ ప్రభుత్వ అధికారులు గురువారం తెలిపారు. 


సింధుపల్చోక్ జిల్లా పరిపాలనాధికారి అరుణ్ పొఖ్రెల్ మాట్లాడుతూ మంగళవారం సాయంత్రం అకస్మాత్తుగా సంభవించిన వరదల్లో ముగ్గురు భారతీయులు, ముగ్గురు చైనీయులు అదృశ్యమైనట్లు తెలిపారు. మంచుకొండ కరిగిపోవడం వల్ల ఈ వరదలు వచ్చినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయన్నారు. 


మెలమ్చి నది పరీవాహక ప్రాంతం నుంచి దాదాపు 200 కుటుంబాలను సురక్షితంగా ఓ పాఠశాలకు తరలించినట్లు తెలిపారు. వీరి ఇళ్ళు వరదల వల్ల తీవ్రంగా దెబ్బతిన్నాయన్నారు. 


Updated Date - 2021-06-17T17:52:58+05:30 IST