3 లేబర్ కోడ్స్‌ బిల్లులకు పార్లమెంటు ఆమోదం

ABN , First Publish Date - 2020-09-24T01:46:51+05:30 IST

కార్మికులు, పారిశ్రామిక సంబంధాలకు సంబంధించిన 3 బిల్లులను రాజ్యసభ బుధవారం ఆమోదించింది. వృత్తి సంబంధ భద్రత, ఆరోగ్యం, పని

3 లేబర్ కోడ్స్‌ బిల్లులకు పార్లమెంటు ఆమోదం

న్యూఢిల్లీ : కార్మికులు, పారిశ్రామిక సంబంధాలకు సంబంధించిన 3 బిల్లులను రాజ్యసభ బుధవారం ఆమోదించింది. వృత్తి సంబంధ భద్రత, ఆరోగ్యం, పని పరిస్థితుల స్మృతి, 2020; పారిశ్రామిక సంబంధాల స్మృతి, 2020; సాంఘిక భద్రత స్మృతి, 2020లకు ఆమోదం తెలిపింది. 


కేంద్ర కార్మిక శాఖ మంత్రి సంతోష్ కుమార్ గంగ్వార్  ఈ మూడు స్మృతుల బిల్లులను బుధవారం రాజ్యసభలో ప్రవేశపెట్టారు. 


ఈ బిల్లులను లోక్‌సభ మంగళవారం ఆమోదించిన సంగతి తెలిసిందే. ఈ బిల్లులు చట్టంగా అమల్లోకి వచ్చిన తర్వాత 50 కోట్ల మంది కార్మికులకు జీతం హామీ, సాంఘిక భద్రత, పని ప్రదేశంలో సరైన వాతావరణం లభిస్తాయని ప్రభుత్వం తెలిపింది. కార్మికులకు అన్ని రకాల సదుపాయాలు, ఆరోగ్యకరమైన వాతావరణం ఉండేందుకు ఈ బిల్లులు హామీ ఇస్తాయని పేర్కొంది. 


Updated Date - 2020-09-24T01:46:51+05:30 IST