3నెలల వర్షం 20 నిమిషాల్లో కురిసింది...

ABN , First Publish Date - 2020-08-13T15:56:48+05:30 IST

స్పెయిన్ దేశంలో జలప్రళయం సంభవించింది. మూడు నెలల్లో కురవాల్సిన వర్షం కేవలం ....

3నెలల వర్షం 20 నిమిషాల్లో కురిసింది...

స్పెయిన్‌లో జల ప్రళయం...

ఎస్టెపా టౌన్ (స్పెయిన్): స్పెయిన్ దేశంలో జలప్రళయం సంభవించింది. మూడు నెలల్లో కురవాల్సిన వర్షం కేవలం 20 నిమిషాల్లో కురవడంతో స్పెయిన్ దేశంలోని ఎస్టెపా పట్టణంలోని సెవిల్లె వీధులను వరదనీరు ముంచెత్తింది. కేవలం 20 నిమిషాల్లో కుండపోత కంటే అధికంగా కురిసిన వర్షంతో ఒక్కసారిగా వరదనీరు సెవిల్లె వీధులను ముంచెత్తింది. ఈ వరదనీటిలో పలు ఇళ్లు కూలిపోయాయి. రోడ్లపై ఉన్న పలు కార్లు వరదనీటిలో కొట్టుకుపోయాయి. ఉరుములు, మెరుపులతో కురిసిన భారీ వడగళ్ల వర్షం వల్ల ఎస్టెపా పట్టణం జలసంద్రమైంది. వరదనీటి ధాటికి ఒక ఇల్లు కుప్పకూలిపోవడం, రోడ్లపై ఉన్న కార్లు వరదనీటిలో కొట్టుకుపోయి తేలియాడటం వీడియోలో కనిపించింది. వరదలు వెల్లువెత్తిన నేపథ్యంలో అధికారులు అలర్ట్ ప్రకటించి సహాయ బృందాలను రంగంలోకి దించారు. 

Updated Date - 2020-08-13T15:56:48+05:30 IST