High alert: కేరళలో మరో ముగ్గురికి జికా వైరస్

ABN , First Publish Date - 2021-07-23T15:41:51+05:30 IST

కేరళ రాష్ట్రంలో కొత్తగా మరో ముగ్గురికి జికా వైరస్ సోకింది...

High alert: కేరళలో మరో ముగ్గురికి జికా వైరస్

తిరువనంతపురం (కేరళ): కేరళ రాష్ట్రంలో కొత్తగా మరో ముగ్గురికి జికా వైరస్ సోకింది.కేరళ రాష్ట్రంలో దోమల వ్యాప్తితో ప్రబలుతున్న జికా వైరస్ కేసులసంఖ్య 44కు పెరిగింది. కేరళలో జికా వైరస్ కేసుల సంఖ్య పెరుగుతుండటంతో దోమల నివారణకు ఫాగింగ్ లాంటి చర్యలు ముమ్మరం చేయాలని కేరళ ఆరోగ్యశాఖ మంత్రి వీణాజార్జ్ అధికారులను ఆదేశించారు. జికా వైరస్ కేసుల సంఖ్య పెరుగుతున్నందున కేరళలో హైఅలర్ట్ జారీ చేశారు. తిరువనంతపురం మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో దోమల నివారణకు అన్ని శాఖలతో కలిసి కార్యాచరణ ప్రణాళిక రూపొందించి అమలు చేయాలని మంత్రి వీణాజార్జ్ సూచించారు. 



జికా వైరస్ నిరోధానికి వీలుగా ప్రత్యేకంగా జిల్లా మెజిస్ట్రేట్ కార్యాలయంలో 24 గంటలు పనిచేసేలా కంట్రోల్ రూంను ఏర్పాటు చేశారు.కేరళ రాష్ట్రంలో జులై 9వతేదీన జికా వైరస్ మొదటి కేసు వెలుగుచూసింది.భారీవర్షాలు కురుస్తున్నందు వల్ల దోమల వ్యాప్తి పెరగడంతో వీటి నివారణకు చర్యలను ముమ్మరం చేయాలని మంత్రి వీణాజార్జ్ ఆదేశించారు. 

Updated Date - 2021-07-23T15:41:51+05:30 IST