యూఏఈ మూడు కొత్త వీసా, రెసిడెన్సీ పథకాలు ఇవే

ABN , First Publish Date - 2021-04-01T13:43:04+05:30 IST

ఈ ఏడాది ప్రారంభం నుంచి గల్ఫ్ దేశం యూఏఈ ఇప్పటి వరకు మూడు కొత్త టూరిస్ట్ వీసా, రెసిడెన్సీ పథకాలను తీసుకొచ్చింది.

యూఏఈ మూడు కొత్త వీసా, రెసిడెన్సీ పథకాలు ఇవే

దుబాయ్: ఈ ఏడాది ప్రారంభం నుంచి గల్ఫ్ దేశం యూఏఈ ఇప్పటి వరకు మూడు కొత్త టూరిస్ట్ వీసా, రెసిడెన్సీ పథకాలను తీసుకొచ్చింది. అవి: 1. రిమోట్ వర్క్ వీసా, 2. ఐదేళ్ల మల్టీ ఎంట్రీ టూరిస్ట్ వీసా, 3. విదేశీ విద్యార్థులు తమతో పాటు తమ కుటుంబ సభ్యులను తెచ్చుకునే రెసిడెన్సీ చట్టం


1. రిమోట్ వర్క్ వీసా: విదేశీయులు ఎలాంటి స్పాన్సర్ లేకుండా దేశంలోకి ప్రవేశించి ఒక ఏడాది పాటు స్టే చేసేందుకు రిమోట్ వర్క్ వీసా ఉపయోగపడుతుంది. అలాగే ప్రత్యేక పరిస్థితులలో వర్చువల్ ఎంప్లాయిమెంట్‌కు ఇది విదేశీయులకు పర్మిట్ ఇస్తుంది. 


2. ఐదేళ్ల మల్టీ ఎంట్రీ టూరిస్ట్ వీసా: ఈ వీసా సందర్శకులను నిర్ధిష్ట ఐదేళ్ల కాల పరిమితిలో అనేకసార్లు దేశంలోకి ప్రవేశించడానికి అనుమతిస్తుంది. అలాగే ప్రతి విజిట్‌పై 90 రోజుల వరకు ఆ దేశంలో స్టే చేసే వీలు ఉంటుంది. 


3. విదేశీ విద్యార్థులు తమతో పాటు తమ కుటుంబ సభ్యులను తెచ్చుకునే రెసిడెన్సీ చట్టం: యూఏఈ కేబినెట్ ఇటీవలే రెసిడెన్సీ చట్టాల సవరణకు అనుమతి ఇచ్చింది. దీనిలో భాగంగా విదేశీ విద్యార్థులను తమతో పాటు తమ కుటుంబ సభ్యులను యూఏఈకి తెచ్చుకునే వెసులుబాటు కల్పించింది. విద్యార్థులు తగిన వసతిని పొందగలిగే వరకు వారు అక్కడే ఉండొచ్చు. 


ఇటీవలి ఈ వీసా పథకాలతో పాటు వైద్య అవసరాలు, పదవీ విరమణ చేసినవారికి ఐదేళ్ల రెసిడెన్సీ, పది సంవత్సరాల గోల్డెన్ వీసా వంటి పలు వీసా, నివాస పథకాలను ప్రస్తుతం యూఏఈ రెసిడెన్సీ వ్యవస్థ కలిగి ఉంది.       

Updated Date - 2021-04-01T13:43:04+05:30 IST