108లో ముగ్గురి ప్రసవం

ABN , First Publish Date - 2020-08-11T10:42:01+05:30 IST

12 గంటల వ్యవధిలోనే ఒకే అంబులెన్స్‌లో ముగ్గురు మహిళలు ప్రసవించారు.

108లో ముగ్గురి ప్రసవం

కులకచర్ల:  12 గంటల వ్యవధిలోనే ఒకే అంబులెన్స్‌లో ముగ్గురు మహిళలు ప్రసవించారు. టేకుల తండాకు చెందిన చోలీబాయికి పురుటి నొప్పులు రాగా కులకచర్లకు చెందిన 108లో తరలిస్తుండగా మార్గమధ్యలో ప్రసవించి మగబిడ్డకు జన్మనిచ్చింది. లాల్‌సింగ్‌ తండా సరోజను  అదే అంబులెన్స్‌లో తరలిస్తుండగా ప్రసవించి మగబిడ్డకు జన్మనిచ్చింది.


గోగ్యానాయక్‌తండా పాపిబాయిని అంబులెన్స్‌లో తరలిస్తుండగా మార్గమధ్యలో ప్రసవించి ఆడ బిడ్డకు జన్మనిచ్చింది. తల్లీబిడ్డలు అందరు క్షేమంగా ఉన్నారు. అంబులెన్స్‌ సిబ్బంది నవీన్‌, అక్బర్‌, ఖుర్షీద్‌లను మహిళల కుటుంబసభ్యులు అభినందించారు.  

Updated Date - 2020-08-11T10:42:01+05:30 IST