గిరిజన రైతులకు త్వరలో త్రీఫేజ్‌ విద్యుత్‌

ABN , First Publish Date - 2021-06-18T04:46:35+05:30 IST

గిరిజన రైతులకు వ్యవ సాయం కోసం బావులకు త్రీఫేజ్‌ విద్యుత్‌ సౌకర్యం త్వరలో కల్పిస్తామని ఎమ్మెల్యే ఆత్రం సక్కు, ఐటీడీఏ పీవో భావేష్‌మిశ్ర అన్నారు.

గిరిజన రైతులకు త్వరలో త్రీఫేజ్‌ విద్యుత్‌
దేవుగూడలో వ్యవసాయ బోరుబావిని పరిశీలిస్తున్న ఎమ్మెల్యే, పీవో

సిర్పూర్‌(యు),జూన్‌ 17: గిరిజన రైతులకు వ్యవ సాయం కోసం బావులకు త్రీఫేజ్‌ విద్యుత్‌ సౌకర్యం త్వరలో కల్పిస్తామని ఎమ్మెల్యే ఆత్రం సక్కు, ఐటీడీఏ పీవో భావేష్‌మిశ్ర అన్నారు. గురువారం మండలం లోని దేవుగూడ గ్రామాన్ని, వ్యవసాయ బావులను వారు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామంలోని గిరిజన రైతులు రెండేళ్ల క్రితమే బోర్లు వేసుకున్నామని, బావులు తవ్వించా మని నాదృషికి తీసుకువచ్చారన్నారు. అలాగే  త్రీఫేజ్‌ విద్యుత్‌కోసం డీడీలు కూడా కట్టారని అన్నారు. దీంతో దేవుగూడ గ్రామాన్ని సందర్శించామ న్నారు. విద్యుత్‌శాఖ ఉన్నత అధికారులతో మాట్లాడి త్వరలోనే విద్యుత్‌ సౌకార్యం కల్పిస్తామ న్నారు. కార్యక్రమంలో జైనూర్‌ మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ ఆత్రం భగవంత్‌రావు, వైస్‌ ఎంపీపీ ఆత్రం ప్రకాష్‌ తదితరులు పాల్గొన్నారు.

హక్కు పత్రాలు ఇవ్వాలి

తిర్యాణి, జూన్‌ 17: పోడు వ్యవసాయం చేస్తున్న కోలాం గిరిజనులకు అటవీహక్కు చట్టం- 2006 ప్రకారం భూసర్వే చేసి హక్కు పత్రాలు మంజూరు చేయాలని ఎమ్మెల్యే ఆత్రం సక్కు తిర్యాని మండలానికి చెందిన నాయకులతో కలిసి ఐటీడీఏ పీవో భవేష్‌ మిశ్రాకు గురువారం వినతిపత్రం సమ ర్పించారు. ఆదివాసులను అటవీ శాఖ అధికారులు తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నా రని అన్నారు. సాగుకు అడ్డు పడుతున్నారని వెంటనే సమస్యను పరిష్కరించాలని కోరారు. నాయకులు గంగారాం, శేకురావ్‌, మహదు తదితరులు ఉన్నారు.

Updated Date - 2021-06-18T04:46:35+05:30 IST