మూడు ముక్కలు... అరవైఆరు షోలు

ABN , First Publish Date - 2021-10-15T06:23:41+05:30 IST

జిల్లాలో పేకాట జోరుగా సాగుతోంది. పోలీసుల నిఘా అంతంతమాత్రం గానే ఉండటంతో పల్లె, పట్టణం అనే తేడా లేకుండా మూ డు ముక్కలు... అరవైఆరు షోలుగా పేకాటరాయుళ్లు పేట్రేగిపోతున్నారు.

మూడు ముక్కలు... అరవైఆరు షోలు

చేతివాటం ప్రదర్శిస్తున్న కొందరు పోలీసులు

తరుచూ పట్టుబడుతున్న మారనితీరు..

కనిపించని నిఘా వ్యవస్థ

పేట్రేగిపోతున్న పేకాటరాయుళ్లు


అనంతపురం క్రైం, అక్టోబరు 14 : జిల్లాలో పేకాట జోరుగా సాగుతోంది.  పోలీసుల నిఘా అంతంతమాత్రం గానే ఉండటంతో పల్లె, పట్టణం అనే తేడా లేకుండా మూ డు ముక్కలు... అరవైఆరు షోలుగా పేకాటరాయుళ్లు పేట్రేగిపోతున్నారు. జిల్లాలోని కొన్ని పట్టణ శివారు ప్రాం తాల్లో  స్థావరాలు ఏర్పాటు చేసి రోజుకు లక్షల్లో పేకాటా డిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఆయా ప్రాం తాల అధి కార పార్టీ ప్రజాప్రతినిధుల అండదండలు ఉండటంతో దర్జాగా పేకాట సాగుతోందని సమాచారం. కొందరు పోలీ సులు సైతం చేతివాటం ప్రదర్శిస్తుండటంతో విచ్చలవి డిగా పేకాట సాగుతోందనే ప్రచారం ఉంది. ఇప్పటికే కొ న్ని కేసుల్లో కొందరు పోలీసులపై జిల్లా ఎస్పీ వేటు వేశా రు. కానీ జిల్లాలో పేకాటజోరు మాత్రం ఆగడం లేదని ఆ వర్గాల ద్వారా వ్యక్తమవుతోంది. 


పోలీసుల చేతివాటం...

జిల్లాలో అక్కడక్కడ పోలీసులు సైతం పేకాటరాయు ళ్లతో చేతివాటం ప్రదర్శించడం పలు విమర్శలకు తావి స్తోంది. ఈక్రమంలోనే ఇటీవల నలుగురు కానిస్టేబుళ్లను వీఆర్‌ బదిలీ చేశారు. కొందరు పోలీసులు పేకాటరాయు ళ్లు ఇచ్చే ఆమ్యామ్యాలకు ఆలవాటుపడి దాడుల సమాచా రం వారికి ముందుగానే చేరవేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. మరికొందరు పేకాటరాయళ్లతో నెలవారీ మా ముళ్ల మత్తులో జోగుతున్నారనే విమర్శలున్నాయి. తరచూ పేకాటరాయుళ్లను అరెస్ట్‌ చేస్తున్నప్పటీకి పేకాట జోరుమా త్రం తగ్గకపోవడం పలు విమర్శలకు తావిస్తోంది. కొన్ని ప్రాంతాల్లో పోలీసులు సైతం ఆవైపు కన్నెత్తి చూడటం లే దని ఆశాఖ వర్గాల ద్వారా తెలిసింది. జిల్లాలో ఈ తంతు వ్యవహారం ఎక్కువగా జిల్లా కేంద్రంతో పాటు ధర్మవరం, హిందూపురం, కళ్యాణదుర్గం, గుంతకల్లు, తాడిపత్రి, కదిరి   ప్రాంతాల్లో  సాగుతోందని వినికిడి. 


 నిఘా ఏదీ ?

జిల్లాలో ఎక్కడైనా చీకటి కార్యకలాపాలు, అసాంఘిక కార్యక్రమాలు జరుగుతున్నట్లైతే వెంటనే పోలీసులకు స మాచారం అందాలి. వీటి కోసం పోలీసుశాఖ ప్రత్యేక విభా గాలు కూడా కేటాయించింది. ప్రతి పోలీసుస్టేషన, ప్రతి సర్కిల్‌, డివిజన పరిధిలో ఎస్‌బీ విభాగం ఉంటాయి. ఈ విభాగంలో అనేక మంది సిబ్బంది ఉంటారు. వీరందరూ ఆయా ప్రాంతాల్లో క్షేత్రస్ధాయిలో ప్రజలతో కలిసి సమా జంలో ఏం జరుగుతోంది..? ఆరా తీసి ఎప్పటికప్పుడు ఉన్నతాధికారులకు తెలియజేయాల్సి ఉంటుంది. హోటళ్లు, ప్రధాన కూడళ్లు, అధికార, అనధికార ప్రభుత్వ కార్యక్రమా ల్లో మఫ్టీలో తిరుగుతూ సమాచారం సేకరించాలి. చీకటి కార్యకలాపాలు ఎక్కడ జరుగుతున్నాయి..? ఎవరు నిర్వ హిస్తున్నారు..? తదితర వివరాలన్నీ కూడా వెంటనే ఎస్పీకి అందజేయాల్సి ఉంటుంది. 


                    కానీ క్షేత్రస్ధాయిలో ఈ విభా గం పనితీరు ఏమాత్రం కనిపించడం లేదనే ఆరోపణలు ఆశాఖ వర్గాల నుంచి వినిపిస్తోంది. కొందరు ఉద్యోగులు మాముళ్ల మత్తులో ఉన్నట్లు సమాచారం. మరికొందరు ఆయా ప్రాంతాల్లో నివాసం ఉండకుండా జిల్లా కేంద్రం నుంచి రాకపోకలు సాగిస్తున్నారని తెలుస్తోంది. కొందరైతే చట్టపు చూపుగా వెళ్లి వస్తున్నారని సమాచారం. ఇదంతా కూడా ఆయా ప్రాంతాల ఉన్నతాధికారులకు తెలిసిన కూ డా పట్టించుకోవడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. తద్వా రా ఎక్కడిక్కడ పేకాట విచ్చలవిడిగా సాగుతోందని వినికి డి. పేకాటరాయుళ్ల ద్వారా వీరికి నెలవారీ మాముళ్లు అం దుతున్నాయని సమాచారం.  




Updated Date - 2021-10-15T06:23:41+05:30 IST