2008 ఆర్థిక మాంద్యం కంటే మూడు రెట్ల నష్టం

ABN , First Publish Date - 2020-05-20T07:15:47+05:30 IST

కరోనా సంక్షోభం నుంచి బయటపడి ప్రపం చ ఆర్థిక వ్యవస్థ మళ్లీ పుంజుకునేందుకు చాలాకాలం పట్టవచ్చన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. లాక్‌డౌన్‌, ప్రయాణ ఆంక్షలు, వ్యాపారాల మూసివేత వంటి కరోనా నియంత్రణ నిర్ణయాలతో...

2008 ఆర్థిక మాంద్యం కంటే మూడు రెట్ల నష్టం

  • ప్రపంచ వృద్ధి -5.5శాతానికి పతనం: ఐహెచ్‌ఎస్‌ మార్కిట్‌ 



వాషింగ్టన్‌: కరోనా సంక్షోభం నుంచి బయటపడి ప్రపం చ ఆర్థిక వ్యవస్థ మళ్లీ పుంజుకునేందుకు చాలాకాలం పట్టవచ్చన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. లాక్‌డౌన్‌, ప్రయాణ ఆంక్షలు, వ్యాపారాల మూసివేత వంటి కరోనా నియంత్రణ నిర్ణయాలతో ప్రపంచ వృద్ధి పునరుద్ధరణకు ఇబ్బందులు ఎదురుకానున్నాయని రెండు నివేదికలు పేర్కొన్నాయి. ఈ ఏడాది ప్రపంచ జీడీపీ వృద్ధి -5.5 శాతానికి క్షీణించవచ్చని ఐహెచ్‌ఎస్‌ మార్కిట్‌ అంచనా వేసింది. కరోనా సంక్షోభంతో గ్లోబల్‌ ఎకానమీకి 2008 ఆర్థిక మాం ద్యం కంటే మూడు రెట్ల నష్టం వాటిల్లనుందని అంటోంది. ఈ సంవత్సరం అమెరికా వృద్ధి రేటు -7.3 శాతానికి, ఐరో పా దేశాల సమాఖ్య జీడీపీ వృద్ధి -8.6 శాతానికి పతనం కావచ్చని ఐహెచ్‌ఎస్‌ మార్కిట్‌ అంచనా. పెద్ద ఎత్తున వ్యాపారాలు దివాలా తీయనున్నాయని, వినియోగదారులు ఖర్చు గణనీయంగా తగ్గించుకోవచ్చని సంస్థ హెచ్చరించింది. ఇది ఆర్థిక వృద్ధికి తీవ్ర విఘాతం కల్గించవచ్చంటోంది. 


Updated Date - 2020-05-20T07:15:47+05:30 IST