మూడు వారాలు నీళ్లు, తిండి లేకున్నా..!

ABN , First Publish Date - 2021-02-02T07:54:07+05:30 IST

మనం మంచి నీళ్లు, ఆహారం లేకుండా ఒక్కరోజు కూడా ఉండలేం! కానీ ఒక పిల్లి మూడు వారాల పాటు పచ్చి మంచి నీళ్లు కూడా తాగకున్నా

మూడు వారాలు నీళ్లు, తిండి లేకున్నా..!

మనం మంచి నీళ్లు, ఆహారం లేకుండా ఒక్కరోజు కూడా ఉండలేం! కానీ ఒక పిల్లి మూడు వారాల పాటు పచ్చి మంచి నీళ్లు కూడా తాగకున్నా బతికి బట్టకట్టింది. ఉక్రెయిన్‌లో ఈ సంఘటన జరిగింది.

ఉక్రెయిన్‌లో వస్తువులు సరఫరా చేసే ఒక కంపెనీ ట్రక్కులో ఒక పిల్లి అనుకోకుండా దూరింది. ఆ విషయాన్ని గమనించకుండా సిబ్బంది ట్రక్కు తలుపులు మూసేసి లాక్‌ చేశారు.

ఆ ట్రక్కు రెండు వేల కిలోమీటర్లు ప్రయాణించి ఉక్రెయిన్‌ నుంచి ఇజ్రాయిల్‌కు చేరుకుంది. అందుకు మూడు వారాల సమయం పట్టింది.

ఈ మూడు వారాలు ఆ పిల్లి ఆ ట్రక్కులోనే ఉంది. అట్టపెట్టెలు తప్ప ఆ పిలిక్లి తినేందుకు, తాగేందుకు ఎలాంటి ఆహారపదార్థాలు లేవు. 

ఇజ్రాయెల్‌ చేరుకున్నాక సిబ్బంది ట్రక్కు తలుపులు తెరిచి చూస్తే అందులో పిల్లి కనిపించింది. మూడు వారాలు గడిచినా పిల్లి ఆరోగ్యంగానే ఉండటం చూసి సిబ్బంది అవాక్కయ్యారు. 

ఈ విషయాన్ని సోషల్‌మీడియాలో షేర్‌ చేయడంలో వైరల్‌ అయింది.

Updated Date - 2021-02-02T07:54:07+05:30 IST