గెలాక్సీ వాచీలకు మూడేళ్ళు

ABN , First Publish Date - 2021-05-22T09:03:44+05:30 IST

గూగుల్‌, శాంసంగ్‌ కలిసి యాపిల్‌ వాచీని తీసుకుంటున్నాయి. ఈ సందర్భంలో తమ వేర్‌ ఓఎ్‌సను శాంసంగ్‌కు చెందిన టైజన్‌ ఔ్‌సను కలిపేసుకుంటున్నట్టు గూగుల్‌ వెల్లడించింది. మోబ్‌వోయ్‌, ఫాజిల్‌ వంటి

గెలాక్సీ వాచీలకు మూడేళ్ళు

శాంసంగ్‌ సాఫ్ట్‌వేర్‌ సపోర్ట్‌


గూగుల్‌, శాంసంగ్‌ కలిసి యాపిల్‌ వాచీని తీసుకుంటున్నాయి. ఈ సందర్భంలో తమ వేర్‌ ఓఎ్‌సను శాంసంగ్‌కు చెందిన టైజన్‌ ఔ్‌సను కలిపేసుకుంటున్నట్టు గూగుల్‌ వెల్లడించింది. మోబ్‌వోయ్‌, ఫాజిల్‌ వంటి కంపెనీలు ఉత్పత్తి చేస్తున్న వాచీల్లో కలగలిసిన ఈ సాఫ్ట్‌వేర్‌ ఉంటుంది. టైజన్‌ ఔ్‌సతో పనిచేస్తున్న శాంసంగ్‌ వాచీల సంగతేమిటి అన్నది ఇప్పుడు ప్రశ్న.  అయితే తమ సాఫ్ట్‌వేర్‌ సపోర్ట్‌ మూడేళ్ళపాటు ఉంటుందని శాంసంగ్‌ అధికారికంగా తెలిపింది.


ఉదాహరణకు శాంసంగ్‌ గెలాక్సీ 3 వాచీని గత ఏడాది విడుదల చేసింది. కొత్త ప్రతిపాదన ప్రకారం 2023 ఆగస్టు వరకు దానికి శాంసంగ్‌ సాఫ్ట్‌వేర్‌ సపోర్టును అందిస్తుంది. ఆప్‌డేట్‌ కాలపరిమితిని ఆండ్రాయిడ్‌, గూగుల్‌ ఇంకా కన్‌ఫర్మ్‌ చేయలేదు. అలాగే శాంసంగ్‌ సైతం టైజన్‌ ఆపరేటింగ్‌ సిస్టమ్‌ విషయంలోనూ ఏమీ చెప్పటం లేదు. మొత్తానికి ఈ కలయికతో తమ వాచీల వినియోగదారులకు మంచి అనుభవం ఇవ్వగలుగుతామని గూగుల్‌ తెలిపింది.  

Updated Date - 2021-05-22T09:03:44+05:30 IST